Begin typing your search above and press return to search.

#RC15 మరో స్టెప్‌ పడింది

By:  Tupaki Desk   |   22 Oct 2021 8:05 AM GMT
#RC15 మరో స్టెప్‌ పడింది
X
రామ్ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించిన విషయం తెల్సిందే. సినిమా ప్రారంభోత్సవ పోస్టర్ కోసం శంకర్ క్రియేటివ్ గా ప్లాన్ చేశాడు. సినిమా నటీ నటులు మరియు టెక్నీషియన్స్ అందరిని కూడా అదే సమయంలో పరిచయం చేశాడు. భారీ రేంజ్ లో దిల్ రాజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు చేయించారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ మొదలు ఎప్పుడెప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నేటి నుండి రామ్‌ చరణ్‌ మరియు శంకర్ ల కాంబో సినిమా పట్టాలెక్కింది. సినిమా చిత్రీకరణ నేటి నుండి మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.

శంకర్‌.. చరణ్‌ ల కాంబో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. శంకర్ సినిమా చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు.. భారీ వీఎఫ్‌ఎక్స్ ఉంటాయని అంతా అనుకుంటు ఉన్నారు. కాని చరణ్ తో చేస్తున్న ఈ సినిమా ను మరీ ఎక్కువ లేట్‌ చేయకుండా భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ లేకుండా సింపుల్‌ గానే శంకర్‌ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ సినిమా లో చేయాలని ఎంతో మంది స్టార్స్ సూపర్‌ స్టార్స్ కోరుకుంటారు. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సినిమాలను అందించిన శంకర్‌ ఇప్పుడు చరణ్‌ తో సినిమా చేస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.

మరో వైపు రామ్‌ చరణ్‌ నటించిన ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదలకు సిద్దం అవుతోంది. టాలీవుడ్‌ జక్కన్న దర్శకత్వంలో రూపొందించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో ఎన్టీఆర్‌ తో కలిసి రామ్‌ చరణ్ నటించాడు. ఇద్దరి కాంబో సన్నివేశాలు జక్కన్న స్థాయిలో ఉంటాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ మాత్రమే కాకుండా నాన్న చిరంజీవి సినిమాలో కూడా చరణ్ చేశాడు. ఆచార్య లో చిరంజీవితో కలిసి నటించిన చరణ్ ఆ సినిమా అంచనాలను మరింతగా పెంచేశాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా ను వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రామ్‌ చరణ్‌ వరుస సినిమాలతో ప్రేక్షకులను అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆర్‌ సి 15 సినిమా ప్రారంభం అయిన నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.