Begin typing your search above and press return to search.

శంకర్ రెడీ అయినా జక్కన్న ఒప్పుకోవాలి కదా..!

By:  Tupaki Desk   |   29 May 2021 4:35 AM GMT
శంకర్ రెడీ అయినా జక్కన్న ఒప్పుకోవాలి కదా..!
X
రామ్‌ చరణ్‌ మరియు శంకర్‌ ల కాంబో మూవీ గురించిన వార్తలు నెట్టింట ప్రతి రోజు వస్తూనే ఉన్నాయి. ఇటీవల స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి అయ్యింది. ఇక షూటింగ్ మొదలు అవ్వడమే ఆలస్యం అంటూ వార్తలు వచ్చాయి. మరో వైపు ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ ను ముగించకుండా శంకర్‌ మరో సినిమాను మొదలు పెడితే ఊరుకునేది లేదు అంటూ లైకా వారు పట్టుబడుతున్నారు. ఇప్పటికే వారు లీగల్‌ గా యాక్షన్ తీసుకునేందుకు కూడా సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో చరణ్ తో శంకర్‌ మూవీ ఎప్పటికి పట్టాలెక్కేను.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేను అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వకీల్ సాబ్‌ సినిమా ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ జులై లో చరణ్ మరియు శంకర్‌ ల మూవీ పట్టాలెక్కించబోతున్నట్లుగా ప్రకటించాడు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ ప్లాన్స్ అన్ని కూడా గందరగోళంగా మారాయి. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ పూర్తి చేయాల్సిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చిత్రీకరణ ఇంకా దాదాపుగా రెండు నెలలు బ్యాలన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. జక్కన్నతో వర్క్‌ చేసే ఏ హీరో అయినా ఆ సినిమా పూర్తి అయ్యే వరకు మరే సినిమాకు కమిట్‌ అవ్వకూడదు. అందుకే ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు చరణ్ కొత్త సినిమా శంకర్ తో మొదలు అయ్యేది కష్టం.

ఇండియన్‌ 2 నిర్మాతలు వివాదం చేస్తున్న నేపథ్యంలో శంకర్‌ మరింత పట్టుదలతో చరణ్‌ సినిమాను స్పీడ్ గా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఎక్కువ ఆలస్యం చేయకుండా ఏడాది కాలంలోనే సినిమాను పూర్తి చేయాలని కూడా ప్లాన్‌ చేశాడట. అన్ని ప్లాన్‌ చేసుకున్న శంకర్‌ కు రామ్‌ చరణ్ డేట్లు ఇబ్బందిగా మారింది. స్క్రిప్ట్‌ వర్క్‌ ను పూర్తి చేసి లొకేషన్స్ ను కూడా ఎంపిక చేసి శంకర్‌ రెడీగా ఉన్నా.. జక్కన్న నుండి పర్మీషన్‌ వచ్చే వరకు రామ్‌ చరణ్‌ వెయిట్‌ చేయాల్సిందే అంటున్నారు. మరి చరణ్‌.. శంకర్ ల కాంబో మూవీ ఎప్పటికి షురూ అయ్యేనో చూడాలి.