Begin typing your search above and press return to search.

హార్ప‌ర్ BAZAAR క‌వ‌ర్ పై RC15 బ్యూటీ

By:  Tupaki Desk   |   5 Feb 2022 2:30 PM GMT
హార్ప‌ర్ BAZAAR క‌వ‌ర్ పై RC15 బ్యూటీ
X
భ‌ర‌త్ అనే నేను- విన‌య విధేయ రామా లాంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది కియ‌రా అద్వాణీ. ఆ త‌ర్వాత తెలుగు ప‌రిశ్ర‌మ‌కు దూర‌మై పూర్తిగా హిందీ చిత్ర‌సీమ‌కే అంకిత‌మైంది. తెలుగులో వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతుంద‌ని అనుకుంటే ఈ అమ్మ‌డు ఇక్క‌డ ఆచితూచి అడుగులేస్తోంది. ఇంత‌కుముందు తార‌క్ స‌ర‌స‌న అవ‌కాశం వ‌చ్చినా శంక‌ర్ తో RC15 కోసం దానిని వ‌దులుకుంది. చ‌ర‌ణ్ స‌ర‌స‌న రెండోసారి న‌టించేందుకు సిద్ధ‌మైంది.

ఏదేమైనా ఆర్.సి 15 ట్రీట్ కి ఇంకో ఏడెనిమిది నెల‌లు పైగానే ప‌డుతుంది. ప్ర‌స్తుతం శంక‌ర్ భార‌తీయుడు 2తో పాటు ఆర్.సి 15ని శ‌ర‌వేగంగా పూర్తి చేసేందుకు ప్ర‌ణాళికల్లో ఉన్నారు. ఇక ఈలోగానే కియ‌రా వ‌రుస ఫోటోషూట్ల‌తో దాడి చేస్తోంది. నిరంత‌రం సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. తాజాగా హార్ప‌ర్ బ‌జార్ అంత‌ర్జాతీయ‌ లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ఈ బ్యూటీ ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్యూర్ డార్క్ బ్లాక్ వెస్ట్ర‌న్ వేర్ లో కియ‌రా కిల్లింగ్ లుక్ మతులు చెడ‌గొడుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. డిజైన‌ర్ లుక్ ప‌రంగా కియ‌రా ప్ర‌తిసారీ ప్ర‌యోగాలు చేస్తూనే ఉంది. ప‌క్కింట‌మ్మాయిలా క‌నిపిస్తూనే హీటెక్కించ‌డం ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త అని చెప్పాలి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... కియారా అద్వానీ పంజాబీ అమ్మాయి కాగా బాలీవుడ్ లో పంజాబీ గాళ్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంది. షేర్షాలో ధైర్య దృఢమైన డింపుల్ గా అత్యంత ఆకట్టుకునే పాత్ర‌లో అత్యున్నత స్థాయి నటనను కనబరిచిన కియారా అద్వానీ ఏ పాత్రనైనా భిన్నమైన పద్ధతులలో న‌టించ‌గ‌ల‌న‌ని ప్రూవ్ చేసింది. బహుముఖ నటిగా పరిశ్రమలో తన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రీతి నుండి మోనికా వరకు డింపుల్ వరకు పంజాబీ పాత్ర‌ల‌తో ఇటీవ‌ల కియ‌రా ఆక‌ట్టుకుంది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌ ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అందంగా ప్రదర్శించింది. క‌బీర్ సింగ్ మొద‌లు ఇటీవ‌ల అక్ష‌య్ తో గుడ్ న్యూస్ వ‌ర‌కూ వ‌రుస‌ హిట్లు త‌న ఖాతాలో వేసుకుంది.

కబీర్ సింగ్ లో ప్రీతిగా పక్కింటి అమ్మాయిగా నిరాడంబరమైన అందమైన పంజాబీ అమ్మాయిగా గుర్తింపు పొందింది. ప్రస్తుత తరంలో అత్యంత ప్రజాదరణ పొందిన అభిమానించే నటీమణులలో ఒకరిగా తన స్థానాన్ని కాపాడుకుంటోంది. కియారా అద్వానీ గుడ్ న్యూజ్ కోసం మోనికా బాత్రాగా పూర్తి భిన్నమైన పాత్రలో న‌టించింది. చిలిపిగా ప్రేమగా ఉండే పంజాబీ కుడిగా ఆ పాత్ర‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కియారా అద్వానీ షేర్షాలో డింపుల్ చీమాగా యుద్ధ భూమి ప్రేమికుడికి ఓదార్పునిచ్చే పాత్ర‌తో ఆశ్చర్యపరిచింది. ఈ పాత్ర‌లతో
కియారా అద్వానీ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత బహుముఖ నటీమణులలో ఒకరిగా ఎదిగింది. ఆమె తన భవిష్యత్ ప్రాజెక్ట్‌ల పాత్రలకు ఎలా జీవం పోస్తుందనేది ఆసక్తికరం. ఆర్.సి 15తో కియ‌రా ఇమేజ్ మ‌రో లెవ‌ల్ ని తాకుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

హారర్ కామెడీ భూల్ భూలయ్యా 2- ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జగ్ జగ్ జీయో .. శశాంక్ ఖైతాన్ కామెడీ డ్రామా లో కియారా అద్వానీ న‌టిస్తోంది. రామ్ చరణ్- శంకర్ ప్రాజెక్టుపై కియ‌రా చాలా హోప్స్ తో ఉంది.