Begin typing your search above and press return to search.

RC15 : సీన్ ఓ షెడ్యూల్‌ చేస్తున్నారా శంకర్‌ సర్‌?

By:  Tupaki Desk   |   23 July 2022 12:30 AM GMT
RC15 : సీన్ ఓ షెడ్యూల్‌ చేస్తున్నారా శంకర్‌ సర్‌?
X
రామ్‌ చరణ్.. శంకర్‌ ల కాంబోలో సినిమా గత ఏడాది సెంప్టెంబర్‌ లో లాంచనంగా ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతూనే ఉంది. సినిమా కోసం పుణె మొదలుకొని ఎన్నో ప్రాంతాల్లో శంకర్ షూటింగ్ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కొత్త షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌ లో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ షెడ్యూల్‌ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులను రెడీ చేస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. సాధారణంగా ఒక సినిమా మూడు నాలుగు షెడ్యూల్స్ లో ముగించేస్తారు. భారీ బడ్జెట్‌ సినిమాలు అయితే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు. ఎక్కువ షెడ్యూల్స్ అవుతాయి.

కానీ శంకర్ సినిమా ఒక్కో సన్నివేశంకు ఒక్కో షెడ్యూల్‌ చొప్పున తీసుకుంటున్నాడా ఏంటీ అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో షెడ్యూల్‌ వారం నుండి పది రోజుల పాటు కొనసాగుతుంది. మళ్లీ చిన్న గ్యాప్ లో మరో షెడ్యూల్‌ ను మొదలు పెడుతున్నారు. మొత్తానికి షూటింగ్‌ హడావుడి చూస్తుంటే ఆర్‌ సీ 15 మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకం కలుగుతుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

ఒక్కో షెడ్యూల్‌ కు భారీగానే శంకర్ ఖర్చు చేస్తున్నాడట. దిల్‌ రాజు ఇప్పటి వరకు నిర్మించిన సినిమా ల్లో ఇదే అత్యంత ఖరీదైన సినిమా గా నిలుస్తుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ఈ సినిమాను రూపొందిస్తున్న కారణంగా కూడా కాస్త ఆలస్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే కానీ ఈ సినిమా ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నయని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఆర్ సీ 15 సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి వరకు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

కాస్త అటు ఇటు అయ్యి సినిమా సంక్రాంతికి రాకున్నా సమ్మర్ లో మాత్రం పక్కా వచ్చేలా శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నారట. శంకర్ సినిమా తర్వాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌ చరణ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.