Begin typing your search above and press return to search.

RC15: ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం అన్ని కోట్లా..?

By:  Tupaki Desk   |   9 July 2022 9:37 AM GMT
RC15: ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం అన్ని కోట్లా..?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #RC15 మూవీ షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్. దిల్ రాజు నిర్మాణంలో భారీ స్థాయిలో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దిల్ రాజు పెద్ద సినిమాలు చేసినా బడ్జెట్ మాత్రం కంట్రోల్ లోనే ఉంటుంది. కానీ ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందే 50వ ప్రాజెక్ట్ కావడంతో నిర్మాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా దర్శకుడి గత చిత్రాల స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ ను తెరకెక్కించడానికి శంకర్ ప్లాన్ చేశారని.. దీని కోసం దాదాపు 10 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని టాక్ వినిపిస్తోంది.

త్వరలో ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ను ప్రారంభించనున్నారని అంటున్నారు. ఇందులో దాదాపు వెయ్యి మంది ఫైటర్స్ పాల్గొంటారట. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని చెబుతున్నారు.

శంకర్ సినిమాలు అధిక బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో ఉంటాయి. సాంగ్స్ - ఫైట్ సీన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. సినిమా బడ్జెట్ లో అధిక భాగం వీటి కోసమే కేటాయిస్తుంటారు. ఇప్పుడు RC15 చిత్రాన్ని కూడా లావిష్ గా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది.

శంకర్ సినిమాల్లో హీరోలను డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ లో ప్రెజెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ ను కూడా విభిన్నమైన లుక్స్ లో చూపించబోతున్నారు. ఇప్పటికే లీకైన ఫోటోలతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.

ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు

శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. 2023 సమ్మర్ సీజన్ లో RC15 చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.