Begin typing your search above and press return to search.

RC 15: శంకర్ ఎంత పట్టించుకున్నా లాభం లేదా?

By:  Tupaki Desk   |   11 Oct 2022 9:46 AM GMT
RC 15: శంకర్ ఎంత పట్టించుకున్నా లాభం లేదా?
X
రామ్ చరణ్ RRR సినిమా తర్వాత పూర్తిస్థాయిలో శంకర్ సినిమా పైన ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా RC 15 సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో సోలోగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కు ఊహించని విధంగా అంతరాయం కలుగుతూ ఉండడం కొంత చిరాకు కూడా తెప్పిస్తోంది. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా కోసం తప్పక మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

ఇక అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం రామ్ చరణ్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసే విధంగా దర్శకుడు శంకర్ ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నాడు. ఇక చరణ్ కూడా ఏమీ అనలేకుండా శంకర్ చెప్పినట్లుగానే ముందుకు సాగుతూ ఉన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకొని దిల్ రాజు సైతం శంకర్ కు మద్దతుగానే ఉన్నాడట. అయితే ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన లీక్స్ మాత్రం ఆగడం లేదు.

ఎప్పుడు ఏదో ఒకటి లీక్ కావడంతో శంకర్ చాలా సీరియస్ అవుతున్నాడట. ఇదివరకే రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో శంకర్ అప్పుడే సీరియస్ గా తీసుకొని షూటింగ్ లోకేషన్లలో కట్టుదిట్టమైన సెక్యూరిటీని సిద్ధం చేశాడు. లోకేషన్ లో ఉన్నవారు కూడా ఫోటోలు తీయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అయితే రీసెంట్గా మరోసారి సినిమాకు సంబంధించిన పాత్రల గురించి లుక్స్ సోషల్ మీడియాలో మరికొన్ని లీక్స్ మొదలయ్యాయి. ఇది సినిమాకు సంబంధించిన ముఖ్యమైన విషయం కావడంతో శంకర్ మరింత అప్సెట్ అయ్యారట. ఎంత జాగ్రత్త ఉన్నా లాభం లేకుండా పోతుంది అని ఇలానే జరిగితే త్వరలోనే సినిమా కథ కూడా బయటకు లీక్ అవుతుందేమో అనేంత టెన్షన్ పడుతున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందే లీక్ కాకుండా సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలి అని శంకర్ ఆలోచిస్తున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.