Begin typing your search above and press return to search.

మాస్ రాజా.. పాతదే ఓకే చేశాడు

By:  Tupaki Desk   |   17 Oct 2015 5:00 PM IST
మాస్ రాజా.. పాతదే ఓకే చేశాడు
X
మొత్తానికి మాస్ రాజా రవితేజ తర్వాతి సినిమా సంగతి తేలిపోయింది. ‘బెంగాల్ టైగర్’ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు రవితేజ. ఈ సినిమా టైటిల్ విషయంలో కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముందు దిల్ రాజు రిజిస్టర్ చేయించిన కొత్త టైటిళ్లలో ఒకటైన ‘ఎవడో ఒకడు’ ఈ సినిమా పేరుగా ప్రచారం జరిగింది. ఐతే ఇంతకుముందు రాజు-రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘భద్ర’ సూపర్ హిట్టయిన నేపథ్యంలో సెంటిమెంటుగా భ అక్షరంతో ‘భోగి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలొచ్చాయి.

ఐతే చర్చోపచర్చల అనంతరం చివరికి ‘ఎవడో ఒకడు’ టైటిల్ కే మాస్ రాజా ఓటేశాడు. ఈమేరకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చేశారు. విజయ దశమికి సినిమా ప్రారంభోత్సవమట. ఇంతకుముందు రాజు బేనర్లోనే ‘ఓ మై ఫ్రెండ్’ తీశాడు వేణు శ్రీరామ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వేణు టాలెంట్ మీద నమ్మకంతో రాజు మరో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇలా తన బేనర్లో ఫ్లాపులిచ్చిన దర్శకులతో మళ్లీ హిట్టు కొట్టిన చరిత్ర రాజుకు ఉంది. వంశీ పైడిపల్లి - హరీష్ శంకర్ ఇలా హిట్టు కొట్టిన వాళ్లే. వేణు కూడా ఆ జాబితాలో చేరతాడని రాజు నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాలో మలయాళ ‘ప్రేమమ్’ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ రవితేజకు జంటగా నటిస్తుండటటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.