Begin typing your search above and press return to search.
ఇటు మెగాస్టార్.. అటు బాలయ్యతో దోస్తీ..
By: Tupaki Desk | 22 Dec 2021 8:00 AM ISTఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి వీరభిమానులైన హీరోలున్నారు. ఇప్పటికీ ఎంత ఎత్తుకి ఎదిగినా అదే అభిమానాన్ని చిరుపై చూపిస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం ఇటు మెగాస్టార్ .. అటు బాలయ్యతో దోస్తీ చేస్తూ అందరిని కలుపుకుపోతూ ఆకట్టుకుంటున్నాడు. అతనే మాస్ మహారాజా రవితేజ. గతంలో బాలయ్యకు మాస్ మహారాజాకు మధ్య మనస్పర్థలు తలెత్తాయంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ అది కేవలం ప్రచారం మాత్రమే నని తాజాగా నిరూపించారు.
`ఆహా` ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ఈ షోలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి మాస్ మహారాజా రవితేజ సందడి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు కూడా. ప్రమోలో బాలయ్యతో కలిసి రవితేజ సందడి చేశారు. ఈ ప్రోమో చూసిన వారంతా మాస్ మమారాజా రవితేజ కెరీర్ తొలి నాళ్లలో అందరితో కలిసి మెలిసి ఎలా వుండేవారో ఇప్పటికే అదే మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా వుంటే అన్నయ్య అంటూ మెగాస్టార్‌ని సంబోధించే మాస్ మహారాజా రవితేజ చాలా ఏళ్ల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీరణ మొదలైన ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కీలక అతిథి పాత్రలో కనిపిస్తారట. ఇందు కోసం పారితోషికం భారీగానే డిమాండ్ చేసిన ఆయన 30 డేస్ కాల్షీట్స్ ని కూడా కేటాయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ గత కొన్నేళ్ల క్రితం చిరు నటించిన `అన్నయ్య` చిత్రంలో తమ్ముడిగా నటించిన విషయం తెలిసిందే.
మళ్లీ దాదాపు 21 ఏళ్ల విరామం తరువాత చిరుతో కలిసి ఈ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అదికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. `క్రాక్` బ్లాక్ బస్టర్ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ షాకిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలున్నాయి. అంతే కాకుండా `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రానికి రవితేజ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం.