Begin typing your search above and press return to search.

పాతికేళ్ల వెనక్కు తీసుకు వెళ్లబోతున్న రవితేజ

By:  Tupaki Desk   |   14 Jun 2021 4:00 PM IST
పాతికేళ్ల వెనక్కు తీసుకు వెళ్లబోతున్న రవితేజ
X
ఈమద్య కాలంలో పీరియాడిక్‌ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. 1980 మరియు 1990 కాలంకు సంబంధించిన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మేకర్స్ కు సక్సెస్ లు దక్కుతున్నాయి. రంగస్థలం మొదలుకుని పలు సినిమాలు కూడా పీరియాడిక్‌ డ్రామాలుగానే రూపొందిన విషయం తెల్సిందే. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కూడా 1940 బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. పీరియాడిక్ డ్రామాల ట్రెండ్‌ నడుస్తున్న ఈ సమయంలో రవితేజ కూడా పాతికేళ్లు వెనక్కు తన సినిమాతో తీసుకు వెళ్లేందుకు సిద్దం అయ్యాడు.

రవితేజ ఇప్పటికే ఖిలాడీ సినిమాను చేశాడు. ఆ సినిమా చిత్రీకరణ దాదాపుగా ముగిసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ పూర్తిగా తగ్గి థియేటర్లు పునః ప్రారంభం అయిన వెంటనే ఖిలాడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఖిలాడీ సమయంలోనే శరత్‌ మండవ అనే కొత్త దర్శకుడితో సినిమాను చేసేందుకు రవితేజ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి. ఆ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ మొదలు అయ్యి తక్కువ సమయంలోనే పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

శరత్‌ మండవ రూపొందించిన కథ 1990 బ్యాక్ డ్రాప్ గా సమాచారం అందుతోంది. పాతికేళ్లు ప్రేక్షకులను వెనక్కు తీసుకు వెళ్లి సర్‌ ప్రైజింగ్‌ ఎలిమెంట్స్ తో సినిమాను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం 1990 బ్యాక్‌ డ్రాప్‌ తో కొన్ని సెట్టింగ్‌ లను కూడా వేయిస్తున్నారు. ఇంతకు ముందు వేసిన ఇతర సినిమాల సెట్టింగ్‌ లను కూడా ఈ సినిమా కోసం వినియోగించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రవితేజ.. శరత్‌ మండవ కాంబో మూవీ ఒక విభిన్నమైన సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.