Begin typing your search above and press return to search.

లేట్ ఏజ్ లో హాట్ హీరోయిన్స్ తో దూసుకుపోతున్నాడు!

By:  Tupaki Desk   |   22 March 2021 7:30 AM GMT
లేట్ ఏజ్ లో హాట్ హీరోయిన్స్ తో దూసుకుపోతున్నాడు!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రంలో మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌ల‌తో స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాతా ఆయ‌న‌ ద్విపాత్ర‌ల‌పై మక్కువ పెంచుకున్నారు. ప్ర‌‌స్తుతం న‌టిస్తున్న ఖిలాడీలో ద్విపాత్రల్లో అభిన‌యిస్తున్నార‌ట‌.

మ‌రోవైపు.. నేను లోక‌ల్ ఫేం త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాని ఉగాదికి ప్రారంభించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇందులో అత‌డు ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని తెలిసింది. నారీ నారీ న‌డుమ మాస్ మ‌హారాజ్ అదిరిపోయే రొమాన్స్ చేస్తార‌ని.. అత‌డి కోసం ఏకంగా ముగ్గురు క‌థానాయిక‌ల్ని ఈ సినిమాలో బ‌రిలో దించుతున్నార‌ని తెలిసింది. శ్రీలీల- లవ్లీ సింగ్ ల‌తో పాటు..జాతిరత్నాలు ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా హీరోయిన్లు గా న‌టించ‌నున్నార‌ట‌. మొత్తానికి రాజా లేట్ ఏజ్ లో ముగ్గురు భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారనుంది.‌

ఏప్రిల్ 13న కొత్త‌ సినిమా ప్రారంభించి.. మే రెండో వారంలో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళతారు. ఖిలాడీ మే 28న విడుదల కానుంది. ఆ సినిమా ప్ర‌చారంతో పాటు.. కొత్త సినిమాతోనూ ర‌వితేజ బిజీ కానున్నారు.