Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకి.. రవితేజ కొత్త బొమ్మ

By:  Tupaki Desk   |   25 Jan 2017 4:48 PM IST
ఎన్నాళ్లకెన్నాళ్లకి.. రవితేజ కొత్త బొమ్మ
X
రవితేజ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పైగానే అయిపోయింది. అసలు 2016 మొత్తంలో ఒక్కటంటే ఒక్కటి కూడా మాస్ మహరాజ్ సినిమా రాలేదు.. కనీసం సెట్స్ పైకి వెళ్లలేదు. గతేడాది మొత్తం సినిమా షూటింగ్ లేకుండానే కంప్లీట్ చేసిన రవితేజ కొత్త సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

జనవరి 26న రవితేజ బర్త్ డే. రిపబ్లిక్ డే కూడా. ఈ సందర్భంగా.. మాస్ మహరాజ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయడమే కాదు.. ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. 'టచ్ చేసి చూడు' అనే టైటిల్ పై రవితేజ కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కుతుండగా.. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. టచ్ చేసి చూడు చిత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. గతంలో రేసుగుర్రం.. మిరపకాయ్.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ విక్రమ్ సిరికొండ. నల్లమలుపు బుజ్జి.. వల్లభనేని వంశీలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్టును మొదట సునీల్ తో చేస్తారనే టాక్ వినిపించింది. కానీ ఫైనల్ గా రవితేజతో ఖాయమైంది. ప్రీతం సంగీతం అందించనుండగా.. ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది. ఏడాదికి పైగా ఒక్క సినిమా చేయని మాస్ మహరాజ్.. మొత్తానికి ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేయడంతో.. రవితేజ ఫ్యాన్స్ తెగ సంతోషంగా ఉన్నారు.