Begin typing your search above and press return to search.

మాస్ రాజాతో మలయాళీ బ్యూటీ?

By:  Tupaki Desk   |   31 Jan 2018 12:27 PM IST
మాస్ రాజాతో మలయాళీ బ్యూటీ?
X
మలయాళీ ముద్దుగుమ్మల అదృష్టం ఏమిటో గాని టాలీవుడ్ లో చూడగానే సౌత్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయిపోతారు. గ్లామర్ లో లిమిట్స్ దాటకుండా ఓ పద్దతిగా కెరీర్ ను సెట్ చేసుకోవడం ఆ భామలకు ఎప్పటి నుంచో వస్తోన్న ఆనవాయితీ. ఇక ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చినా కూల్ బ్యూటీలు హాట్ గర్ల్స్ కి గట్టి పోటీని ఇస్తున్నారు. వారిలో నివేత థామస్ కూడా ఒకరు. చిన్న చిన్నగా తన ఇమేజ్ ను పెంచుకుంటున్న నివేతా స్టార్ హీరోలతో జతకడుతోంది.

చివరగా ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో కనిపించి బాక్స్ ఆఫీస్ హిట్ అను అందుకున్న సంగతి తెలిసిందే. చేసింది చిన్న పాత్రే అయినా అమ్మడు స్టార్ హీరోలను ఆకర్షిస్తోంది. ఇక కొన్ని నెలల క్రితం రవితేజ నెల టికెట్ లో ఛాన్సును అందుకున్న అమ్మడు మళ్లీ ఎందుకో ఆ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. అయితే ఇప్పుడు మిస్ అయినట్టు ఇప్పుడు మిస్ చేసుకోవద్దని నివేతా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది.

నాలుగోసారి కలవబోతోన్న ఈ కాంబోలో నివేతా దాదాపు సెట్ అయినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే నివేతా ఈ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ఏ విషయాన్ని చెప్పలేదు. ఆ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. అమర్ అక్బర్ అంథోని అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.