Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురి ఆశ‌ల‌న్నీ బెంగాల్ టైగ‌ర్ మీదే!

By:  Tupaki Desk   |   2 Nov 2015 7:30 PM GMT
ఆ ముగ్గురి ఆశ‌ల‌న్నీ బెంగాల్ టైగ‌ర్ మీదే!
X
ర‌వితేజ - త‌మ‌న్నా - రాశిఖ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం బెంగాల్ టైగ‌ర్‌. సంప‌త్‌నంది ద‌ర్శక‌త్వంలో రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఇటీవ‌ల విడుద‌లైన విష‌యం తెలిసిందే. భీమ్స్ సంగీతంలో రూపొందిన ఆడియో ఇప్ప‌టికే శ్రోత‌ల‌ను అల‌రిస్తోంది. ఆడియో స‌క్సెస్ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్‌ న‌గ‌ర్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. అది ఏంటంటే....ఫైన‌ల్ వెర్ష‌న్ చూసిన టీ్‌మ్ అంత సంతృప్తి చెందలేద‌ట‌. కొంత మంది సూచ‌న మేర‌కు రీ షూట్లు చేస్తున్న‌ట్లు వినికిడి. ఇప్ప‌టికే బిజినెస్ ప‌రంగా అంతంత మాత్ర‌మే ఉన్న ఈ సినిమా మ‌ళ్లీ రీషూట్లు అంటే త‌డిసి మోపెడు అవ‌డం ఖాయం అంటున్నారు సినీ పెద్ద‌లు.

కిక్‌-2 దెబ్బ‌కు కిక్ లేకుండా పోయింది ర‌వితేజ‌కు ఈ సినిమా అయినా త‌న‌కు మ‌ళ్లీ కిక్ ఇస్తుందేమో అంటే ఇది అలాగే క‌నిపిస్తుంది. ఈ సినిమా సంప‌త్ నందికి కూడా హిట్ అవ‌డం చాలా అవ‌స‌రం. ఎందుకంటే ప‌వ‌న్‌ తో సినిమా అని చాలా కాలం త‌న టైమ్ వేస్టు చేసుకున్నాడు. అక్క‌డ నుంచి బ‌య‌ట‌కొచ్చి వెంట‌నే ర‌వితేజ‌తో సినిమా ఫైన‌ల్ చేసుకున్నాడు. ఆ క‌సితో సినిమా చేశాడు.

కాబ‌ట్టి ఈ సినిమాని హిట్ చేసి త‌న స‌త్తాని నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న సినిమాలు చేస్తూ వ‌చ్చిన భీమ్స్ బెంగాల్ టైగ‌ర్‌ కి మ్యూజిక్ చేశారు. త‌న‌కు కూడా ఈ సినిమా హిట్ కావాల్సిన అవ‌స‌రం చాలా ఉంది. ఈ సినిమాపై ఇంత మంది జీవితాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. చూద్దాం చివ‌రికి ఈ టైగ‌ర్ త‌న ప‌వ‌ర్ చూపెడుతుందో లేదో!