Begin typing your search above and press return to search.

వార్నాయినో.. రవితేజ ఏంటిలా?

By:  Tupaki Desk   |   4 March 2016 10:56 AM IST
వార్నాయినో.. రవితేజ ఏంటిలా?
X
మాస్ రాజా రవితేజ ఆ మధ్య బక్కచిక్కిన అవతారంలోకి మారిపోయి షాకిచ్చాడు. ఆ లుక్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో మళ్లీ కొంచెం ఒళ్లు చేసే పనిలో పడ్డాడు. ఐతే ఇప్పుడు మాస్ రాజా అవతారం చూస్తే దిమ్మదిరగడం ఖాయం. దాదాపు రెండు నెలలుగా బయటెక్కడా కనిపించని రవితేజ.. సడెన్‌ గా సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారిపోయి ఆశ్చర్యపరిచాడు. మాస్ రాజా సిక్స్ ప్యాక్ యాబ్స్ తో కనిపిస్తున్న ఫొటోలు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముందు ఇవేమైనా ఫేక్ ఫొటోలా అన్న అనుమానాలు కలిగాయి కానీ.. రవితేజ మిత్రుడైన డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం ఈ ఫొటోల్ని రీట్వీట్ చేయడంతో మాస్ రాజా నిజంగానే సిక్స్ ప్యాక్ పెంచిన సంగతి కన్ఫమ్ అయింది.

తాను వర్కవుట్ చేసిన జిమ్ లోనే మాస్ రాజా ఇలా ఫొటోలకు పోజులిచ్చాడు. బాలీవుడ్ కండల వీరుల తరహాలో బైసెప్స్ కూడా చూపిస్తూ పోజిచ్చాడు మాస్ రాజా. ఇంతకీ రవితేజ ఇంత కష్టపడింది ఏ సినిమా కోసమా అన్న ఆరాలు మొదలయ్యాయి. బహుశా అది కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘రాబిన్ హుడ్’ కోసమే కావచ్చు. నిజానికి దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తో ‘ఎవడో ఒకడు’ ఈపాటికి ఆ సినిమాను ఓ కొలిక్కి తేవాల్సింది. కానీ ప్రారంభోత్సవం కూడా జరుపుకున్న ఆ సినిమా అనివార్య కారణాల వల్ల పక్కనబడిపోయింది. చక్రి కథ నచ్చి దానికి ఓకే చెప్పేశాడు మాస్ రాజా. రాబిన్ హుడ్ అన్న పేరు పెట్టాడంటే ఇందులో ‘కిక్’ తరహా క్యారెక్టరేదో చేస్తున్నట్లున్నాడు. లుక్ విషయంలో ఇలా ఏదో ఒక ప్రత్యేకత చూపించకపోతే ఈ రోజుల్లో జనాల్ని ఆకర్షించడం కష్టం. అందుకే మాస్ రాజా అంత కష్టపడ్డట్లున్నాడు.