Begin typing your search above and press return to search.

చిరు 154లో క్రేజీ హీరో క్యారెక్ట‌ర్ ఇదేనా?

By:  Tupaki Desk   |   11 July 2022 9:33 AM GMT
చిరు 154లో క్రేజీ హీరో క్యారెక్ట‌ర్ ఇదేనా?
X
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. గ‌తంతో పోలిస్తే మూడు నాలుగు ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. రీసెంట్ గా `ఆచార్య‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన చిరంజీవి ప్ర‌స్తుతం మూడు భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో రూపొందుతున్న మూవీ `గాడ్ ఫాద‌ర్‌`. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` ఆధారంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఈ మూవీని ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాను. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇక ఈ మూవీతో పాటు త‌మిళ హిట్ మూవీ `వేదాలం` ఆధారంగా తెర‌కెక్కుతున్న `భోళా శంక‌ర్‌`లో న‌టిస్తున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో చిరుకు సిస్ట‌ర్ గా క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇదిలా వుంటే ఈ సినిమాల‌తో పాటు మెగాస్టార్ స్ట్రెయిట్ స్టోరీతో 154వ ప్రాజెక్ట్ ని యంగ్ డైరెక్ట‌ర్ బాబితో చేస్తున్నారు. క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ భారీ సినిమాని నిర్మిస్తోంది. `వాల్తేరు వీర‌య్య‌` నే టైటిల్ ని ఫైన‌ల్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ని జూలై 13 నుంచి ప్రారంభించ‌బోతున్నారు. ఈ మూవీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

గ‌త కొంత కాలంగా త‌న పాత్ర‌కు సంబంధించిన వార్త‌ల‌కు చెక్ పెడుతూ చిత్ర బృందం జూలై 13న ప్రారంభం కాఉన్న తాజా షెడ్యూల్ ని ర‌వితేజ‌, చిరంజీవిల‌పై ప్లాన్ చేసింద‌ట. ఈ షెడ్యూల్ లో ఈ ఇద్ద‌రు పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. తాజా వార్త‌ల ప్ర‌కారం ఇందులో ర‌వితేజ మెగాస్టార్ చిరంజీవికి సోద‌రుడిగా క‌నిపించ‌బోతున్నార‌ట‌. త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో ఓ భార్య‌, పిల్లాడితో క‌లిసి శ్రీ‌లంక‌లో జీవించే వ్య‌క్తిగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో ర‌వితేజ క‌నిపించ‌నున్నార‌ట‌.

అంతే కాకుండా జూలై 18 వ‌ర‌కు ఓ మాసీవ్ సాంగ్ ని చిరు ఇంట్రో సాంగ్ గా షూట్ చేయ‌బోతున్నార‌ని తెలిసంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ గ‌తంలో చిరంజీవి న‌టించిన `అన్న‌య్య‌` మూవీలో త‌మ్ముడిగా న‌టించాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అదే త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌టం విశేషం. ఇందులో చిరుకు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `రామారావు ఆన్ డ్యూటి` జూలై 29న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శ‌ర‌త్ మండ‌వ తెర‌కెక్కించిన ఈ మూవీని సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు.