Begin typing your search above and press return to search.

రవితేజ తన మొత్తం కెరీర్‌ లో ఇలా ఇదే ప్రథమం

By:  Tupaki Desk   |   14 Dec 2022 8:45 AM GMT
రవితేజ తన మొత్తం కెరీర్‌ లో ఇలా ఇదే ప్రథమం
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా డిసెంబర్‌ చివరి వారంలో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా పై రవితేజ గతంలో ఎప్పుడూ లేనంత నమ్మకంతో ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రవితేజ కెరీర్‌ ఆరంభం నుండి కూడా ప్రమోషన్ విషయంలో పెద్దగా యాక్టివ్‌ గా కనిపించడు. తన సినిమాల ప్రమోషన్‌ విషయాలను పెద్దగా పట్టించుకోని రవితేజ ఈసారి మాత్రం రెండు వారాల ముందు నుండే ధమాకా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు. పూర్తిగా రెండు వారాలను సినిమా ప్రమోషన్ కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నాడట.

కెరీర్‌ లో ఎప్పుడు కూడా ఒక సినిమా కోసం రవితేజ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. పైగా ఈ సారి ధమాకా సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ తో ఫోటో సెషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ధమాకా చర్చ జరిగే విధంగా రవితేజ సాధ్యం అయినంత ఎక్కువ పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

టీవీ కార్యక్రమాలు.. ప్రత్యేక షో లు మరియు ఇంటర్వ్యూలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ధమాకా సినిమా స్థాయిని పెంచే విధంగా రవితేజ ప్లాన్ చేశాడట. ఈ సినిమా లో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడట. సినిమా పై ఉన్న నమ్మకంతోనే ఆయన ప్రమోషన్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటున్నారు.

ఇదే శ్రద్ద తన అన్ని సినిమాలకు కూడా చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాల యొక్క మేకింగ్‌ కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ను సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ మరియు ఇతర ప్రమోషనల్ విషయాలు చూపిస్తున్నాయి. అందుకే ధమాకా సినిమా సక్సెస్‌ అవుతుందనే అంతా ఆశిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.