Begin typing your search above and press return to search.

రీమేక్ దుమ్ము దులుపుతున్న మాస్ రాజా

By:  Tupaki Desk   |   21 Sept 2015 4:00 AM IST
రీమేక్ దుమ్ము దులుపుతున్న మాస్ రాజా
X
సినిమాలు ఎంచుకోవడంలో రవితేజ ముందు వెనుక ఆలోచించడని అంటారు. ఎక్కువ ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకుండా చకచకా సినిమాలు చేసుకెళ్లిపోతుంటాడు మాస్ రాజా. ఐతే ఓ దశలో మరీ స్పీడెక్కువైపోయి.. చెత్త సినిమాలు చేసి వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడతను. సారొస్తారా సినిమా టైంకి రవితేజ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఐతే ఆ తర్వాత ఆచితూచి అడుగేశాడు. బలుపు, పవర్ లాంటి హిట్లు కొట్టాడు. కానీ మళ్లీ కిక్-2 విషయంలో తప్పటడుగు వేశాడు. దీంతో రవితేజ పరిస్థితి మొదటికొచ్చింది. ఇప్పుడు మళ్లీ తనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు మాస్ రాజా.

ప్రస్తుతానికి రవితేజ ఖాతాలో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. బెంగాల్ టైగర్ - ఇంకోటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా. ఐతే ఇవి రెండూ కూడా రొటీన్ సబ్జెక్టులే. ఐతే వరుసగా రొటీన్ సినిమాలు చేస్తే జనాలు ఆదరించే పరిస్థితి లేదు. స్టార్ హీరోల నుంచి కూడా కొత్తదనం ఆశిస్తున్నారు. అందుకే రవితేజ కూడా ఓ భిన్నమైన సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇందుకోసం ఎప్పట్నుంచో పెండింగులో పెట్టిన ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ మీద అతను కన్నేసినట్లు సమాచారం. తమిళ దర్శక నిర్మాత త్యాగరాజన్ ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్నాడు. తెలుగు వెర్షన్ కి రవితేజను సంప్రదించాడు. అతను ఓకే అన్నాడు కానీ.. సినిమా మొదలుపెట్టడానికి మాత్రం ముందుకు రాలేదు. ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అన్న డైలమాతో హోల్డ్ లో పెట్టాడు. ఐతే ఈ మధ్య తెలుగులో డిఫరెంట్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. దీంతో స్పెషల్ చబ్బీస్ రీమేక్ చేయడానికి ధైర్యం వచ్చింది రవితేజకు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి చూస్తున్నాడట.