Begin typing your search above and press return to search.

ఇంతకీ ఆ రీమేక్ ఉన్నట్టా లేనట్టా?

By:  Tupaki Desk   |   20 Aug 2015 4:43 AM IST
ఇంతకీ ఆ రీమేక్ ఉన్నట్టా లేనట్టా?
X
టాలీవుడ్ లో ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ హీరోల్లో రవితేజ ఒకడు. మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా అని ఓ డైలాగ్ ఉంటుంది కదా. రవితేజ కూడా అదే టైపు. డైరెక్టర్ ను నమ్మితే చాలు.. ఏం ఆలోచించకుండా సినిమా చేసేస్తాడు. చాలామంది గమనించని విషయం ఏంటంటే.. రవితేజ కెరీర్ లో చాలా హిట్ సినిమాలు వేరే హీరోలు మాకొద్దని వదిలేసినవే. ఆ లిస్టు కొంచెం పెద్దదే ఉంటుంది. అందుకే కొంచెం రిస్క్ ఉన్న సబ్జెక్టులు రవితేజ దగ్గరికొస్తుంటాయి. ఆ మధ్య హిందీ సూపర్ హిట్ ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ కూడా ఎవరో కాదన్నాకే రవితేజ దగ్గరికొచ్చింది. ఐతే మాస్ రాజా ఈసారి వెంటనే ఓకే చెప్పేయలేదు. అలాగని తిరస్కరించనూ లేదు. ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది ఆ సినిమా.

ఇంతకీ స్పెషల్ చబ్బీస్ రీమేక్ స్టేటస్ ఏంటి అని రవితేజను అడిగితే.. ‘‘రీమేక్ అనుకున్నాం. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పెషల్ చబ్బీస్ ఉన్నదున్నట్లు తీస్తే మనవాళ్లు చూడరనుకుంటున్నా. ఎందుకంటే ఆ సినిమాలోని పాత్రలన్నీ డల్ గా ఉంటాయి. మనకలా కుదరదు. నా నుంచి ప్రేక్షకులు అలాంటి డల్ నెస్ ఆశించరు. అందుకే సినిమాలో భారీ మార్పులు చేయాలి’’ అని సెలవిచ్చాడు రవితేజ. ఐతే భారీ మార్పులు చేయాలన్నాడు కానీ.. ప్రస్తుతం ఆ మార్పులు జరుగుతున్నాయా లేదా.. చేస్తే ఎవరు చేస్తున్నారు అన్న సంగతి వెల్లడించలేదు మాస్ రాజా. దీంతో పాటు వెంకటేష్ తో చేయాలనుకున్న మల్టీస్టారర్ గురించి కూడా మాట్లాడాడు రవితేజ. వీరూ పోట్ల దర్శకత్వంలో వెంకీతో కలిసి ఓ మల్టీస్టారర్ చేయాలనుకున్న మాట వాస్తవమే అని.. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని.. మల్టీస్టారర్స్ చేయడానికి తనకెలాంటి ఇబ్బందీ లేదని రవితేజ చెప్పాడు. వెంకీతో చేయాలనుకున్నది ‘జిల్లా’ రీమేకా కాదా అన్నది అతను వెల్లడించలేదు.