Begin typing your search above and press return to search.

రవితేజ కొరియాపై కన్నేశాడటగా!!

By:  Tupaki Desk   |   18 Aug 2016 10:22 AM IST
రవితేజ కొరియాపై కన్నేశాడటగా!!
X
మాస్ మహరాజ్ రవితేజ ఇప్పుడు చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ లో వచ్చిన బెంగాల్ టైగర్ తర్వాత.. కొత్త సినిమా ఏదీ స్టార్ట్ చేయలేదు రవితేజ. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసే ఈ మాస్ హీరో.. 9 నెలల పాటు ఖాళీగా ఉండడమంటే అదో పెద్ద రికార్డ్ గా చెప్పుకోవాలి. రవితేజ హీరోగా మారాక ఇంతటి గ్యాప్ ఎప్పుడూ రాలేదనే మాట వాస్తవమే. రెమ్యూనరేషన్ విషయంలో మెట్టు దిగకపోవడమే ఇందుకు కారణం అనే మాటలు వినిపించినా.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడిపోయాడీ హీరో.

తనతో పవర్ అంటూ పవర్ ఫుల్ మూవీ తీసన బాబీకి.. మరోసారి ఛాన్స్ ఇస్తున్నాడు రవితేజ. 'పవర్' అటు దర్శకుడికి పేరు తేవడమే కాకుండా.. ఇటు మంచి వసూళ్లు కూడా సాధించింది. ఇప్పుడు ఓ సౌత్ కొరియన్ మూవీని అడాప్ట్ చేసుకుని.. తెలుగుకు వీలుగా స్క్రిప్ట్ మార్చి.. మాస్ మహరాజ్ తో చేయనున్నాడట బాబీ. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత కన్ఫాం అయినా.. త్వరలో రవితేజ స్వయంగా ప్రకటించనున్నాడట.

ఇది కాకుండా విక్రమ్-దీపక్ అనే జంట దర్శకులతో కూడా ఓ మూవీని రవితేజ చేయనున్నాడు. ఇందులో స్టైలిష్ పోలీస్ గా ఈ మాస్ రాజా కనిపించనుండడం విశేషం. అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. ఈ రెండు సినిమాలు ఒకేసారి మొదలుపెట్టేస్తారట. రెండు నెలల గ్యాప్ లో రిలీజ్ చేయాలన్నది రవితేజ ఆలోచనగా తెలుస్తోంది.