Begin typing your search above and press return to search.
4 సినిమాలు వదిలి.. 8 దేశాలు తిరిగాడు
By: Tupaki Desk | 1 Dec 2016 1:00 PM ISTగతేడాది డిసెంబర్ 10న బెంగాల్ టైగర్ రిలీజ్ అయ్యాక.. రవితేజ ఇప్పటివరకూ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కించలేదు. ఈ మధ్యలో నాలుగు ప్రాజెక్టులు అనుకున్నా.. అవేవీ పట్టాలెక్కలేదు. మొదట వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎవడో ఒకడుతో ప్రారంభించి.. చక్రి అనే దర్శకుడితో రాబిన్ హుడ్.. బాబీతో ఓ ప్రాజెక్ట్.. విక్రమ్-దీపక్ జంట దర్శకులు తీస్తామన్న ఓ పోలీస్ స్టోరీలు.. మొదలుకాకముందే ఆగిపోయాయి. అయితే 4 ప్రాజెక్టులు వదిలేసిన రవితేజ.. ఈ సమయంలో 8 దేశాలు చుట్టొచ్చేశాడు.
బెంగాల్ టైగర్ రిలీజ్ తర్వాత అమెరికా - బ్యాంకాక్ లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రౌండ్స్ కొట్టేశాడు మాస్ మహరాజ్. వీటిలో యూఎస్ ట్రిప్ ఒకటి ఫ్యామిలీతో వెళ్లగా.. మిగిలినవన్నీ సింగిల్ గానో.. ఫ్రెండ్స్ తోనో చక్కర్లు కొట్టాడు. ప్రపంచం చుట్టేయడం ఎప్పుడూ బాగానే ఉంటుంది కానీ.. సినిమాలను పక్కన పెట్టేసి మరీ టూర్స్ అంటేనే ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.
దాదాపు సెలబ్రిటీ ఫ్యామిలీలంతా అకేషన్ ఉన్నపుడల్లా లాంగ్ టూర్స్ వేస్తూనే ఉంటారు. కానీ ఏడాదిపాటు ఒక్క సినిమా కూడా ఫైనల్ చేయలేకపోవడం.. అదికూడా రవితేజ ఎక్కువ రెమ్యూనరేషన్(9కోట్లు అని టాక్) డిమాండ్ కారణంగానే అనే ఆరోపణలు రావడం.. ఆలోచించాల్సిన విషయాలే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/