Begin typing your search above and press return to search.

మాస్ రాజా.. 7 నెలల తర్వాత మేకప్

By:  Tupaki Desk   |   11 May 2016 1:00 AM IST
మాస్ రాజా.. 7 నెలల తర్వాత మేకప్
X
మాస్ మహరాజ్ రవితేజ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలమే అయింది. గతేడాది డిసెంబర్ ప్రారంభంలో బెంగాల్ టైగర్ విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏదీ స్టార్ట్ చేయని రవితేజ.. ఇప్పుడు తన కొత్త మూవీకి కొబ్బరి కొట్టబోతున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత జూన్ లో కొత్త సినిమా స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు రవితేజ.

రాబిన్ హుడ్ అనే టైటిల్ పై తెరకెక్కనున్న చిత్రంలో మాస్ మహరాజ్ హీరో. కొత్త డైరెక్టర్ చక్రి ఈ చిత్రాన్ని రూపొందించనుండగా.. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ చిత్రాన్ని జూన్ 2వ వారంలో మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకోగా.. రవితేజ కూడా తన పర్సనాలిటీని బాగా ఛేంజ్ చేసుకున్నాడని తెలుస్తోంది. గత సినిమాల్లో బాగా సన్నగా కనిపించడం, ఫేస్ లో ఏజ్ ముదిరిపోయిన లక్షణాలు బైటపడ్డంతో గెటప్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు రవితేజ.

దిల్ రాజు బ్యానర్ లో చేయాల్సిన ఎవడో ఒకడు మూవీ క్యాన్సిల్ అయ్యాక.. రవితేజ ఈ సమయాన్ని తన గెటప్ ను ఇంప్రూవ్ చేసుకునేందుకు కేటాయించాడు. బాగా బరువు పెరగడమే కాదు.. ఆ మధ్య సిక్స్ ప్యాక్ చేసిన ఫోటోలను కూడా మీడియాకి ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి పాత రవితేజని మళ్లీ చూపిస్తూ.. కొత్త ఎనర్జీతో సిద్ధమవుతున్నాడని అంటున్నారు మాస్ మహరాజ్ సన్నిహితులు.