Begin typing your search above and press return to search.

ఇదండీ మాస్ రాజా అసలు అవతారం

By:  Tupaki Desk   |   23 Aug 2015 7:18 AM IST
ఇదండీ మాస్ రాజా అసలు అవతారం
X
ఒక యువ కథానాయకుడు వయసు మళ్లినవాడిగా కనిపించాలంటే మేకప్ తో చాలా కష్టపడాల్సి ఉంటుంది. జుట్టు రంగు దగ్గర్నుంచి మిగతా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్త పడాలి. కానీ అదే హీరోకు వయసు మీద పడితే అతణ్ని కుర్రాడిగా చూపించడమే కష్టం. మేకప్ తో చాలా కవర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సీనియర్ హీరోల విషయంలో మేకప్ చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నది వాస్తవం. ముఖ్యంగా వయసుకు తగ్గ పాత్రలంటే అస్సలు ఇష్టపడని తెలుగు హీరోలు మేకప్ విషయంలో చాలానే కష్టపడుతుంటారు. ఐతే సీనియర్ హీరోలు అప్పుడప్పుడూ మాత్రం వయసు మళ్లిన వాళ్లలా కనిపించాల్సి వస్తుంటుంది. అలాంటపుడు కూడా ఒరిజినల్ అవతారం చూపించడానికి ఇష్టపడరు మన హీరోలు.

ఐతే మాస్ రాజా రవితేజ మాత్రం తాను రియల్ గా ఎలా ఉంటాడో అలా కనిపించేశాడు ‘కిక్-2’ సినిమాలో. కిక్ కళ్యాణ్ గా, అతడి కొడుకు రాబిన్ హుడ్ గా రెండు పాత్రల్లో కనిపించాడు మాస్ రాజా. తండ్రి పాత్ర ఆరంభంలో ఓ ఐదు నిమిషాలు తళుక్కుమంటుంది. కొడుకు తనంత ఎత్తు ఎదిగిపోయాక యంగ్ గా కనిపిస్తే బాగుండదు కదా.. అందుకే తెల్ల గడ్డంతో, తక్కువ మేకప్ తో ఒరిజినల్ గా కనిపించే ప్రయత్నం చేశాడు మాస్ రాజా. గెటప్ బాగానే అనిపించింది. ఐతే తండ్రీ కొడుకులు ఒకేసారి కనిపించినపుడు.. తండ్రి పాత్రకు తక్కువలా, కుర్రాడి పాత్రకు ఎక్కువలా కనిపించాడు మాస్ రాజా. వయసు మీద పడటం, బాగా చిక్కడం వల్ల మాస్ రాజాను కుర్రాడిగా చూడ్డం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కానీ తనదైన శైలిలో ఎప్పట్లాగే టన్నుల కొద్దీ ఎనర్జీ చూపించడంతో మాస్ రాజాకు ఎదురు లేకుండా పోయింది.