Begin typing your search above and press return to search.

ర‌వితేజ గుట్టు విప్ప‌ట్లేదేంటి?!

By:  Tupaki Desk   |   18 July 2015 12:49 PM IST
ర‌వితేజ గుట్టు విప్ప‌ట్లేదేంటి?!
X
రేపో మాపో `కిక్‌2` రాబోతోంది. మ‌రోప‌క్క `బెంగాల్ టైగ‌ర్` కూడా పూర్తి కావొస్తోంది. అయినా స‌రే.. ర‌వితేజ మాత్రం త‌దుప‌రి సినిమాపై గుట్టు విప్ప‌డం లేదు. ఎప్పుడూ ఒక సినిమా చేస్తుండ‌గానో, మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే ర‌వితేజ త‌దుప‌రి చేయ‌నున్న చిత్రం ఏంట‌న్న విష‌యంపై ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ సాగుతోంది. ఇదివ‌ర‌కైతే ర‌వితేజ యేడాదికి మూడు సినిమాల్లెక్క‌న చేసేవాడు. కానీ ఆమ‌ధ్య ఎదురైన ప‌రాజ‌యాల వ‌ల్ల బండి కాస్త స్లో అయిపోయింది. `బ‌లుపు`తో మ‌ళ్లీ పుంజుకొన్నాడు. `ప‌వ‌ర్‌`తో మ‌రో బంప‌ర్ హిట్టు కొట్టిన ఆయ‌న త‌దుప‌రి వ‌రుస‌గా రెండు సినిమాల‌కి ఓకే చెప్పేశాడు. అవే కిక్‌2, బెంగాల్ టైగ‌ర్‌. అవి కూడా ఒక దాని వెంట మ‌రొక‌టి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ర‌వితేజ కొత్త సినిమా గురించి ఈపాటికే నిర్ణ‌యం తీసుకొనుండాల్సింది. మ‌రి ఆయ‌న అస‌లు ప్లానింగేంటో తెలియ‌దు.

అయితే ఫిల్మ్‌ న‌గ‌ర్లో మాత్రం ర‌వితేజ త‌దుప‌రి సినిమాకి ఓకే చెప్పేశాడ‌ని చెప్పుకొంటున్నారు. `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్‌ తో ర‌వితేజ ఓ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి అందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. `కందిరీగ‌`తో హిట్టు కొట్టినా... `ర‌భ‌స‌`తో ఆయ‌న‌కి ఫ్లాప్ ఎదురైంది. ఆ విష‌యంలోనే ర‌వితేజ ఆలోచిస్తున్నాడేమో మ‌రి! అయితే ర‌వితేజ నిర్ణ‌యం ఏదైనా కావొచ్చు... మ‌రో వారం రెండు వారాల్లో కొత్త సినిమా వివ‌రాలు బ‌య‌టికొచ్చే అవ‌కాశాలు మాత్రం ఉన్నాయి. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించిన `కిక్‌2` ఆగ‌స్టు 15న విడుద‌ల చేస్తారని ప్ర‌చారం సాగుతోంది. `బెంగాల్ టైగ‌ర్‌` ద‌స‌రాకి వ‌స్తాడు.