Begin typing your search above and press return to search.

ఓ మై ఫ్రెండ్ డైరెక్ట‌ర్‌ తో మాస్‌ రాజా

By:  Tupaki Desk   |   7 Sep 2015 5:37 AM GMT
ఓ మై ఫ్రెండ్ డైరెక్ట‌ర్‌ తో మాస్‌ రాజా
X
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కి కిక్‌2 పెద్ద పంచ్ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ ఇవ్వ‌డంతో రాజాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. కిక్‌2 ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌ రెడ్డి పై ర‌వితేజ సూటిగా కామెంట్స్ చేశారు. మొత్తానికి ఆ ఎపిసోడ్ క్లోజ్‌. ఇప్పుడు న‌టిస్తున్న బెంగాళ్ టైగ‌ర్‌ పైనే ర‌వితేజ పూర్తిగా దృష్టి సారించాడు.

ఈ చిత్రానికి సంప‌త్‌ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మెజారిటీ భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇటీవ‌లే ఫస్ట్ లుక్ స్టిల్ రిలీజ్ చేశారు. పులి లాంటి కుర్రాడికి అనుకోని సంఘ‌ట‌న ఎదురైతే ఏం జ‌రిగింది? అన్న‌దే సినిమా. పోస్ట‌ర్‌ లోనే రాజాలోని మాస్‌ ని ఓ రేంజులో ఎలివేట్ చేశారు. ఈ సినిమా మ‌రోసారి మాస్‌ లో దూసుకుపోవ‌డం ఖాయ‌మ‌నే అనిపిస్తోంది. అయితే ఈలోగానే మ‌రో హాట్ న్యూస్‌.. బెంగాళ్ టైగ‌ర్ ఆన్‌ సెట్స్ ఉండ‌గానే ర‌వితేజ మ‌రో స్స‌యిసీ న్యూస్‌ తో చ‌ర్చ‌ల్లో కొచ్చాడు. అత‌డు మ‌రో యంగ్ డైరెక్ట‌ర్‌ కి ఓకే చెప్పాడు. దిల్‌రాజు సంస్థానంలో ఆస్థాన ద‌ర్శ‌కుడిగా కొన‌సాగిన వేణు శ్రీ‌రామ్‌ కి ఈసారి ఛాన్సిచ్చాడు. వేణు శ్రీ‌రామ్ గ‌తంలో సిద్ధార్థ్ హీరోగా దిల్‌ రాజు నిర్మించిన ఓ మై ఫ్రెండ్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే ర‌వితేజ‌కి క‌థ ఒక‌టి వినిపించాడు వేణు. ఈ క‌థ‌కి ఇంప్రెస్ అయిపోయిన మాస్ రాజా వెంట‌నే ఓకే చెప్పేశాడుట‌.

వేణు శ్రీ‌రామ్ ఇటీవ‌లి కాలంలో బెంగ‌ళూర్ డేస్ రీమేక్‌ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని వార్త‌లొచ్చినా కొన్ని అవాంత‌రాల వ‌ల్ల మ‌ధ్య‌లో డ్రాప‌య్యాడు. ప్ర‌స్తుతం ఆ సినిమాని వేరొక ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికైతే వేణు శ్రీ‌రామ్ మాస్‌ రాజాని బుట్ట‌లో వేశాడు. ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉందింకా.