Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఇన్నాళ్లు దాచింది బయట పెట్టేసిన రవితేజ

By:  Tupaki Desk   |   10 April 2020 5:30 AM GMT
ఫొటోటాక్‌ : ఇన్నాళ్లు దాచింది బయట పెట్టేసిన రవితేజ
X
మాస్‌ మహారాజ్‌ రవితేజ దాదాపు మూడు దశాబ్దాల కాలంగా టాలీవుడ్‌ లో కొనసాగుతూ వస్తున్న విషయం తెల్సిందే. మొదట సహాయ దర్శకుడిగా ప్రయత్నించి ఆ తర్వాత నటుడిగా మారి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు దక్కించుకుని హీరోగా టర్న్‌ అయిన రవితేజ రెండు దశాబ్దాలుగా హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు. డౌన్‌ టు ఎర్త్‌ అంటూ రవితేజను ఫ్యాన్స్‌ ప్రశంసిస్తూ ఉంటారు. హీరోగా రవితేజ కెరీర్‌ ఒక పుష్కర కాలం పీక్స్‌ లో ఉంది. కాని గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.

అయిదు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఇంకా రవితేజ కుర్రాడిగా సినిమాల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. హీరోగా రవితేజ కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పాల్సిన టైం వచ్చింది అంటూ ఆయన ఫ్లాప్‌ సినిమాలు ఆయనకు చెప్పకనే చెబుతున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్రాక్‌ చిత్రంతో పాటు రెండు మూడు సినిమాలు లైన్‌ లో పెట్టిన రవితేజ తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఫొటో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఇప్పటి వరకు రవితేజను నల్లటి గడ్డం, నల్లటి జుట్టుతోనే చూశాం. మొదటి సారి తెల్లటి గడ్డంతో అతడు కనిపించాడు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ అవ్వడం వల్ల ఇంట్లోనే ఉంటూ వర్కౌట్స్‌ చేస్తున్న రవితేజ తాజాగా ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. తనకు తానుగా ఈ ఫొటోను విడుదల చేయడంతో తన వయసు పెరిగింది ఇక హీరోగానే కాకుండా కెరీర్‌ లో టర్న్‌ తీసుకునే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ఆయన చెప్పకనే చెప్పాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు హిట్‌ కాకుంటే రవితేజ వయసుకు తగ్గ సినిమాలు చేసుకోవాల్సి రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.