Begin typing your search above and press return to search.

ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్‌.. పాత్ర‌లు ఇవే!

By:  Tupaki Desk   |   8 March 2021 5:34 AM GMT
ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్‌.. పాత్ర‌లు ఇవే!
X
వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలా ప‌డిపోయిన ర‌వితేజ‌కు ‘క్రాక్’ ఇచ్చిన బూస్టింగ్ అలాంటి ఇలాంటిది కాదు! త‌న కెరీర్ కే ఓ సంజీవ‌ని వంటిద‌ని చెప్పొచ్చు. సంక్రాంతి బ‌రిలో దిగిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సీటింగ్ కెపాసిటీ 50 శాతం ఉన్న టైమ్ లోనూ భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చిన ర‌వితే వ‌రుస‌గా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఖిలాడీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు మాస్ మ‌హ‌రాజ్‌. క్రాక్ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత వ‌స్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీని ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నాడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో ‘వీర’ చిత్రం వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి ‘ఖిలాడీ’గా ముందుకు రాబోతున్నారు.

అయితే.. ఈ ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఈ మేరకు ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే.. ఆ పాత్రలు ఏంట‌న్న‌ది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ర‌వితేజ క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి మీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. మే 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మ‌రి, తండ్రీకొడుకులుగా ర‌వితేజ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి.