Begin typing your search above and press return to search.

రేపు సాయంత్రం ఎఫ్‌ ఎంలో కిక్కో కిక్కు

By:  Tupaki Desk   |   29 July 2015 12:32 PM IST
రేపు సాయంత్రం ఎఫ్‌ ఎంలో కిక్కో కిక్కు
X
ఎఫ్‌ ఎం రేడియోల్లో సినిమాల ప్రమోషన్‌ పరాకాష్ట లో ఉంది. సిటీలో నాలుగైదు ఎఫ్‌ ఎం స్టేషన్లు నిత్యం తారలతో కళకళలాడుతుండడం చూస్తున్నాం. అప్పట్లో బాహుబలి ప్రభాస్‌ సైతం ముంబై వెళ్లి అక్కడ రేడియో ఎఫ్‌ ఎం వాళ్లకు ఇంటర్వ్యూ లు ఇచ్చాడని చదువుకున్నాం. ఇప్పడు ఎఫ్‌ ఎం స్టేషన్ల లో సినిమాల యాప్‌లు కూడా లాంచ్‌ చేస్తున్నారు. ఇదో లేటెస్టు ట్రెండ్‌ అనుకోవాలేమో.

డీటెయిల్స్‌లోకి వెళితే... రేపటి సాయంత్రం హైదరాబాద్‌ బంజారా హిల్స్‌ లోని రేడియో సిటీ 91.1 ఎఫ్‌ ఎం కి రవితేజ అండ్‌ బృందం బయల్దేరుతోంది. అక్కడ కిక్‌ 2 కి సంబంధించిన యాప్‌ని లాంచ్‌ చేయబోతున్నారు. ఆ సందర్భంగా బోలెడంత కిక్కు రేడియో శ్రోతలకు ఎక్కించబోతున్నారు. మాస్‌ మహారాజ్‌ రవితేజ, దర్శకుడు సురేందర్‌ రెడ్డి తదితర బృందం ఈ కిక్కు కార్యక్రమంలో అదనపు కిక్కు ఇవ్వడానికి రెడీ అవుతోంది.

సాయంత్రం 5గంటలకి యాప్‌ రిలీజవుతుంది. ఆ తర్వాత ఇందులో కిక్కు పోస్టర్లు, టీజర్‌ లు, పాటల బిట్‌లు సందడి చేస్తాయి. యూత్‌ కిక్‌ 2 యాప్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకుని పండగ చేసుకోవడమే తరువాయి. కిక్‌2 ఆగష్టు మిడిల్‌ లో రిలీజ్‌ కి రెడీ అవుతోంది.