Begin typing your search above and press return to search.

అప్పుడు మిస్స‌యినా ఈసారి మిస్స‌వ్వ‌ర‌‌ట‌!

By:  Tupaki Desk   |   6 April 2021 10:00 PM IST
అప్పుడు మిస్స‌యినా ఈసారి మిస్స‌వ్వ‌ర‌‌ట‌!
X
మాస్ మహారాజ్ రవితేజ - మారుతి కాంబినేష‌న్ మూవీ గురించి ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆల్మోస్ట్ ఈ కాంబినేష‌న్ మూవీ ఓకే అయిపోయింద‌న్న ప్ర‌చారం సాగింది. కానీ చివ‌రి నిమిషంలో ర‌వితేజ ఈ మూవీ నుంచి త‌ప్పుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పారితోషికం ప‌రంగా కుద‌ర‌క‌పోవ‌డమే అందుకు కార‌ణ‌మ‌ని ప్ర‌చార‌మైంది.

ఆ త‌ర్వాత ర‌వితేజ స్థానంలో గోపిచంద్ చేరారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే టైటిల్ తో పూర్తి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోంది. మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. త‌దుప‌రి షెడ్యూల్ కి ప్లాన్ సిద్ధ‌మ‌వుతోంది. యువి క్రియేష‌న్స్ - జీఏ2 సంస్థ‌లు సంయ‌క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 1 విడుదల చేయాల‌న్న‌ది ప్లాన్.

తాజా స‌మాచారం మేర‌కు.. మ‌రోసారి రవితేజతో మారుతి భేటీ అయ్యార‌ని ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మారుతి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ పూర్తి చేస్తూనే ర‌వితేజ కోసం స్క్రిప్టును రెడీ చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. మ‌రోవైపు ర‌వితేజ ఖిలాడి షూటింగ్ ‌లో బిజీగా ఉన్నారు. త‌దుప‌రి త్రినాధ రావు నక్కిన సెట్స్ ‌లో చేరనున్నారు. మారుతి పూర్తి స్క్రిప్టు రెడీ అయితే వెంట‌నే మూవీని ప్రారంభిస్తార‌ట‌. బ‌హుశా వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది.