Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: యమహానగరిలో యమా హాట్ పాప

By:  Tupaki Desk   |   29 April 2020 9:50 AM GMT
ఫోటో స్టోరీ: యమహానగరిలో యమా హాట్ పాప
X
కలకత్తా భామ రియా చక్రబర్తి పేరు తెలుగు ప్రేక్షకుల్లో తక్కువ మందికే తెలిసి ఉంటుంది ఎందుకంటే ఈ భామ తెలుగులో నటించింది ఒకటి అరా సినిమాలే. 'తూనీగా తూనీగా' అనే సినిమాలో నటిస్తే అది ఫ్లాపుగా నిలిచింది. అయితే ఈ భామ హిందీలో కూడా నటించి తన సత్తా చాటింది. అసలే బెంగాలీ రసగుల్లా.. పైగా ఈ తరం భామ కావడంతో సోషల్ మీడియాను ఓ ఆటాడుకుంటుంది.

ఇన్స్టాగ్రామ్ లో ఈ భామకు రెండు మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. వారు కరోనా వార్తలతో నిరాశలో కూరుకుపోకుండా కిరాకు ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు పెద్ద కవిత జు క్యాప్షన్ లాగా జోడించింది. "ఇది మొత్తం. ఇది కొంచెం. ఇది విశాలంగా ఉండే మహా ప్రపంచం. నా హృదయంలో ఉండండి. దారి చూపించడం ఒక కళ. నేను వివరించాలనుకుంటున్నాను. నేను నా దారిలో నడవాలని అనుకుంటున్నాను. జ్వాలలో మండుతున్న తాజా పట్టును కొరుకోవడం సులువు. #నేను రచయిత్రినని మీకు ఇప్పుడు తెలుసు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అసలే అందమైన హాటు భామ. ఏదో జ్వాల అంటూ కవిత్వం రాసింది. బన్నీజీ.. గురూజీలు సంక్రాంతికి చెప్పారుగా.. ఊరికే లాజిక్కులు తీయక 'జస్ట్ సరెండర్ అయిపోవాలంతే'.

డ్రెస్ విషయానికి వస్తే సిమెంట్ కలర్ గౌన్ లో స్టైల్ గా నిలుచుంది. భారీ వీ నెక్.. థై స్లిట్ తో మతి చెడిపోయే ఎక్స్ ప్రెషన్ తో నెటిజెన్లను మాయలో పడేస్తోంది. వయ్యారి బెంగాల్ భామ కావడంతో అందాలను కూడా కనువిందుగానే వడ్డించింది. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు కూడా పెట్టారు. "లాక్ డౌన్ ఫైర్".. "రియల్ హాట్ నెస్".. "కోల్ కతా జలేబీ" అంటూ కొందరు స్పందించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ భామ ప్రస్తుతం 'చెహ్రే' అనే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హాష్మి.. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.