Begin typing your search above and press return to search.

40లోను నాటు అందాలు ఎర వేస్తున్న న‌టి

By:  Tupaki Desk   |   10 Nov 2022 4:35 AM GMT
40లోను నాటు అందాలు ఎర వేస్తున్న న‌టి
X
మీరా జాస్మిన్ గురించి పరిచ‌యం అవ‌స‌రం లేదు. ర‌వితేజ స‌ర‌స‌న భ‌ద్ర‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న గుడుంబా శంక‌ర్ చిత్రాల్లో న‌టించింది. అయితే ఎక్స్ పోజింగ్ ప‌రంగా ఏనాడూ హ‌ద్దు మీరింది లేదు. సాంప్ర‌దాయ చీర‌కట్టులో ఎంతో అందంగా ప‌ద్ధ‌తిగానే క‌నిపించింది. చెల‌రేగి అందాల ఆర‌బోత‌కు స‌సేమిరా అనేది.

కానీ ఇప్పుడు అనూహ్యంగా మీరా జాస్మిన్ కొత్త లుక్ లోకి మారింది. నేటిత‌రం నాయిక‌ల‌కు ధీటుగా ఎక్స్ పోజింగ్ తో చెల‌రేగడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇది ఎవ‌రు..? ఇంత‌కీ మీరా యేనా? అంటూ కొంద‌రు సందేహిస్తున్నారు. అంత‌గా మేకోవ‌ర్ ని చూపిస్తోంది మీరా జాస్మిన్.

తాజా ఫోటోషూట్ లో మీరా జాస్మిన్ పూర్తి భిన్నంగా క‌నిపిస్తోంది. మునుప‌టితో పోలిస్తే బొద్దుత‌నం త‌గ్గింది. రూపంలో మార్పు చేర్పులు క‌నిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మునుప‌టి కంటే టూ హాట్ గా క‌నిపిస్తోంది. తాజా ఫోటోషూట్ లో ఫ్లోర‌ల్ డిజైన్ ఫ్రాక్ లో అందాలు ఆర‌బోసింది. ఒక ర‌కంగా తాను తెలుగు చిత్ర‌సీమ‌లో రీఎంట్రీ కోసం స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్నాన‌ని ఫీల‌ర్స్ ని వ‌దిలింద‌ని చెప్పాలి.

పెళ్లి త‌ర్వాత పిల్ల‌లు సంసార బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చిన మీరా ప్ర‌స్తుతానికి మ‌ల‌యాళంలో న‌టిస్తూ బిజీగానే ఉంది. కానీ తెలుగు- త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల‌కు దూర‌మైంది. ఇక‌పై అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోను అవ‌కాశాల్ని కోరుకుంటోంది. అందుకే ఇలా హద్దులు చెరిపేసి చెల‌రేగుతోందంటూ మీరా తాజా ఫోటోషూట్ పై కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా ప్ర‌తిభావ‌ని అయిన మీరా జాస్మిన్ రీఎంట్రీ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఇప్పుడు చిరంజీవి- బాల‌కృష్ణ‌- నాగార్జున‌- వెంక‌టేష్- రాజ‌శేఖ‌ర్- మోహ‌న్ బాబు లాంటి సీనియర్ స్టార్ల‌కు మ‌రో అద‌న‌పు నాయిక అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టేన‌ని భావిస్తున్నారు. మ‌రి మీరా ఆశించిన రేంజులో కెరీర్ ప‌రంగా కంబ్యాక్ అవుతుందా లేదా చూడాలి.

ఇంత‌లోనే ఎంత మార్పు మీరా?రన్ - గుడుంబా శంకర్ వంటి సినిమాల్లో మీరా న‌ట‌న‌కు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. కానీ అనూహ్యంగా పెళ్లితో సినిమాల‌కు దూర‌మైంది. కొంత గ్యాప్ తో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తిరిగి దుమారం రేపుతోంది. ఇటీవ‌ల‌ అద్భుతమైన ఫోటోషూట్ ల‌తో అల‌రిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో మీరా రోజువారీ పోస్ట్ లతో అల‌రిస్తోంది.

ఇప్ప‌టికే త‌న‌కు 40 ఏళ్లు నిండాయి. కాబట్టి యువ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు రావ‌డం అంత‌ సులువేమీ కాదు. బోల్డ్ పాత్రలో ఆమెను హీరోయిన్ గా నటింపజేయడం అసాధ్యం. మన పెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇచ్చినా కానీ ప్ర‌ధాన లీడ్ పాత్ర‌ల‌ను ఆఫ‌ర్ చేస్తారా? అన్న‌ది స‌స్పెన్స్. అయినా మీరా ప‌ట్టువ‌ద‌ల‌క త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పోటీ ఎంత ఉన్నా.. డిమాండ్ ఉన్న అందాల యువ‌నాయిక‌లు ఎంద‌రు పోటీలో ఉన్నా కానీ మీరా త‌గ్గేదేలే అంటూ ప్ర‌య‌త్నిస్తోంది. రీఎంట్రీలో త‌న‌ను ఆదుకునే పెద్ద తెలుగు హీరో ఎవ‌రు? అన్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.