Begin typing your search above and press return to search.

బోయపాటి సినిమాకి అవే ప్రాబ్లమ్స్!?

By:  Tupaki Desk   |   24 Oct 2016 4:31 AM GMT
బోయపాటి సినిమాకి అవే ప్రాబ్లమ్స్!?
X
సాధారణంగా ఓ సినిమాకి యాక్టర్లో టెక్నీషియన్లో మారడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ప్రొడ్యూసరే మారిపోయే సంఘటనలు బాగా అరుదుగా జరుగుతాయి. ఒకే సినిమాకి ఒకటికి నాలుగు సార్లు నిర్మాత మారడం అంటే మాత్రం అక్కడ ఏదో జరుగుతోందనే విషయం గమనించాల్సిందే.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా కన్ఫాం అవడమే కాదు.. ఇప్పటికే లాంఛ్ అయిపోయింది కూడా. ప్రాజెక్టు అనుకున్నప్పటి నుంచి ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఛేంజ్ అవుతూనే ఉన్నాడు. మొదట సినిమా అనుకున్నపుడు బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఆ తర్వాత ఈయన సైడ్ అయిపోగా.. నల్లమలుపు బుజ్జి సీన్ లోకి వచ్చాడు. తరువాత బుజ్జి తప్పుకోవడంతో అభిషేక్ నామా బోయపాటి ప్రాజెక్టుకు బ్యాక్ బోన్ గా నిలుస్తాడని అన్నారు. ఇప్పుడు ఈయన కూడా ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇప్పుడు బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాజెక్టును రవీంద్రా రెడ్డి అనే కొత్త నిర్మాత సీన్లోకి వచ్చాడట. వచ్చే నెలలో విడుదల కానున్న నాగ చైతన్య మూవీ సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి నిర్మాతే ఈ రవీంద్రా రెడ్డి. మరి ఈయనైనా సినిమా పూర్తయ్యే వరకూ ఉంటాడో.. వేరే ఎవరైనా ఎంట్రీ ఇస్తారో తెలియాల్సి ఉంది. కానీ.. అసలు ఈ ప్రాజెక్టుకు ఇంతమంది నిర్మాతలు మారడానికి కారణం ఏంటో? ఏంటో బోయపాటికి అవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయ్!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/