Begin typing your search above and press return to search.

క్షణం డైరెక్టర్ తో బన్నీ సినిమా??

By:  Tupaki Desk   |   6 April 2018 4:30 AM GMT
క్షణం డైరెక్టర్ తో బన్నీ సినిమా??
X
రెండేళ్ల క్రితం విడుదల అయిన టాలీవుడ్ మూవీ క్షణం సూపర్ సక్సెస్ సాధించింది. రూ. 1.1 కోట్ల టైట్ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. అంతకు నాలుగు రెట్లకు పైగానే వసూలు చేయగలిగింది. శాటిలైట్.. రీమేక్ రైట్స్ రూపంలో నిర్మాతలకు భారీగానే లాభాలు అందించిన ఆ చిత్రంతో దర్శకుడు రవికాంత్ పెరెపు ఇండస్ట్రీ జనాలను బాగానే ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం రవికాంత్ పెరెపు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనిలో సిద్ధు జొన్నలగడ్డ-సీరత్ కపూర్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. రానా దగ్గుబాటి నిర్మాత కావడం విశేషం. రీసెంట్ గా ఈ డైరెక్టర్ ఓ స్టోరీని నెరేట్ చేశాడట. ఈ కథను విన్న రానా.. వెంటనే అల్లు అర్జున్ ను పిలవడం.. వీరిద్దరికీ కలిపి రవికాంత్ నెరేషన్ ఇవ్వడం.. అది నచ్చడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. క్షణం దర్శకుడితో సినిమా చేయడంపై ప్రస్తుతం ఆలోచిస్తున్నాడట బన్నీ.

డిఫరెంట్ సబ్జెక్ట్ కావడంతో.. ఈ చిత్రంపై అల్లు అర్జున్ మక్కువ చూపుతున్నాడని తెలుస్తోంది. ప్రాజెక్టు సాధ్యమైతే.. దీన్ని తానే నిర్మిస్తానని చెప్పాడట రానా దగ్గుబాటి. కంప్లీట్ స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేయాల్సిందిగా సూచించారట రానా అండ్ బన్నీ. ప్రస్తుతం రానాతో పాటు మరో నిర్మాత నిరంజన్ రెడ్డికి కూడా కమిట్ అయ్యాడు రవికాంత్ పెరెపు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమాను చేయాల్సి ఉంటుందట. ఈ లోగా కంప్లీట్ స్క్రిప్ట్ ను వర్కవుట్ చేయమని సూచించాడట బన్నీ.