Begin typing your search above and press return to search.

అసిస్టెంట్ల హంగామా ఎక్కువైంది -రవి బాబు

By:  Tupaki Desk   |   9 July 2016 9:42 AM GMT
అసిస్టెంట్ల హంగామా ఎక్కువైంది -రవి బాబు
X
ఒక పంది పిల్లతో కూడా సినిమా తీసేయవచ్చు అని ప్రూవ్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు దర్శకనటుడు రవిబాబు. మనోడికి క్రియేటివ్‌ టాలెంట్‌ గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ సమయంలో ఒక ఇంట్రస్టింగ్‌ విషయం గురించి డిస్కస్ చేయాలి మనం. అసలు ఆదివారం మటన్‌ కొనడానికి కూడా స్వయంగా వెళ్ళి క్యూలో నుంచుంటాడట ఈయన. అంతేకాదు.. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ అన్నా కూడా.. తన కారును తానే డ్రైవ్ చేసుకుంటూ వెళతాడట. ఏంటి మాష్టారూ ఇదంతా?

''అబ్బే ఏం లేదండి. ఏదో సినిమా ఇండస్ర్టీలో పనిచేయడం వలన.. చాలామందికి ఈ అసిస్టెంట్ అనే తెగులు అంటుకుపోయింది. సెట్ లో ప్రతీదానికీ అసిస్టెంట్లను పెట్టేసి.. మనల్ని బాగా గారాబం చేస్తున్నారు. దాని వలన తరువాత ఈ అసిస్టెంట్లు ఎవరూ చుట్టూ లేనప్పుడు మనకు ఇబ్బంది కలుగుతోంది. రియాల్టీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అందుకే నేను అసిస్టెంట్లను మెయిన్టయిన్ చేయను. నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటా. నా పనులు నేనే చేసుకుంటా. కాకపోతే ఒక మేకప్ కుర్రాడిని మాత్రం పెట్టుకున్నా. ఎందుకంటే నాసిరకం మేకప్ కిట్ వాడితే మన స్కిన్ పాడవుతుంది. సో.. అక్కడ మాత్రం టచ్ అప్ కోసం ఒకరిని పెట్టుకోక తప్పట్లేదు'' అంటూ సెలవిచ్చాడు రవిబాబు.

ఈయనే ఆన్ స్ర్కీన్ వేసే పాత్రలకూ.. ఈయన రియల్‌ లైఫ్‌ నేచర్ కు.. ఏమాత్రం సంబంధం లేదు కదూ. అది సంగతి.