Begin typing your search above and press return to search.

చిరు క‌న్నీళ్లు పెట్టుకునేంత‌గా ర‌వితేజ ఏం అన్నాడు?

By:  Tupaki Desk   |   9 Jan 2023 4:09 AM GMT
చిరు క‌న్నీళ్లు పెట్టుకునేంత‌గా ర‌వితేజ ఏం అన్నాడు?
X
'వాల్తేరు వీర‌య్య‌' ప్రీఈవెంట్ గ్యాల‌రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఉత్కంఠ‌గా వీక్షిస్తుండ‌గా మాస్ మ‌హారాజా ర‌వితేజ స్పీచ్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ముఖ్యంగా ర‌వితేజ ఫ్లో ఫ్రీ స్ట‌యిల్ బ్రిలియ‌న్సీతో ఆ వాక్చాతుర్యం మైమ‌రిపించింది. ర‌వితేజ స్పాంటేనియ‌స్ పంచీ స్పీచ్ మైండ్ బ్లాక్ చేసింది. అత‌డిలోని డైన‌మిజాన్ని ఈ స్పీచ్ ఎలివేట్ చేసింది. ర‌వితేజ‌లోని వ్యంగ్యం విరుపు కామెడీ టైమింగ్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఇలా అన్ని కోణాలు ఈ వేదిక‌పై బ‌య‌ట‌ప‌డ్డాయి. అత‌డు సింపుల్ స్పీచ్ ని త‌క్కువ స‌మ‌యంలో అద‌రగొట్టాడు.

వైజాగ్ లో చ‌లి ఎక్కువ‌గా ఉంది! అంటూ స్పీచ్ మొద‌లు పెట్టిన ర‌వితేజ త‌న ద‌ర్శ‌కుడు బాబీని ద‌గ్గ‌ర‌కు పిలిచి గౌర‌వించాడు. పూన‌కాలు లోడింగ్ అంటూ అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూనే ''ఆల్ ది బెస్ట్ అని చెప్ప‌ను శుభాకాంక్ష‌లు'' మాత్ర‌మే చెబుతాన‌ని.. స‌క్సెస్ మీట్ లో మ‌ళ్లీ క‌లుస్తామ‌ని విశాఖ వాసుల‌ను ఉద్ధేశించి అన్న‌య్య చిరు ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడారు ర‌వితేజ‌. అత‌డి కాన్ఫిడెన్స్ చూస్తే వీర‌య్య బాక్సాఫీసులు బ‌ద్ధ‌లు కొట్ట‌డం ఖాయ‌మైంద‌న్న టాక్ కూడా ఏయు గ్రౌండ్స్ లో అభిమానుల కోలాహాలం న‌డుమ‌ స్ప్రెడ్ అయ్యింది.

బాబి గుంటూరు నుంచి వ‌చ్చాడు. నేను విజ‌య‌వాడ నుంచి వ‌చ్చాను! అన్న‌య్య అభిమానులుగా ... అయితే అన్న‌య్య‌ అప్ప‌టికి సుప్రీంహీరో మెగాస్టార్.. ఆయ‌న ఎక్క‌డో ఉన్నారు... అంటూ ర‌వితేజ త‌న ప్రేమ‌ను అభిమానాన్ని చిరుపై కురిపించారు. సుప్రీంహీరో చిరంజీవి న‌టించిన 'విజేత' ఫంక్ష‌న్ విజ‌య‌వాడ పిడ‌బ్ల్యూ గ్రౌండ్స్ లో జ‌రిగింది. అప్పుడు ఎక్క‌డో ఉన్నారు చిరంజీవి గారు.. ద‌గ్గ‌ర‌గా వెళ్లి చూడ‌లేక‌పోయాను.

చిరంజీవి గారి ప‌క్క‌న భానుప్రియ గారు మ‌రొక‌రు కూచున్నారు. ఏదో ఒక రోజు అక్క‌డ కూచుంటాను అని న‌మ్మ‌కంగా అనుకున్నా! అని ర‌వితేజ అన్నారు. అత‌డు ఆరోజు అనుకున్న‌దే ఇప్పుడు నిజ‌మైంది. ఇప్పుడు అన్న‌య్య చిరంజీవి ప‌క్క‌నే త‌న‌కో సీట్ ద‌క్కింది అంటే ర‌వితేజ‌లోని విల‌క్ష‌ణ‌త ఎన‌ర్జీ డైన‌మిజ‌మే కార‌ణం. నిజంగానే తాను అన్నది సాధించుకుని తీరిన విక్ర‌మార్కుడు అత‌డు అని అంగీక‌రించాలి.

టాలీవుడ్ కి వ‌చ్చి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మొద‌లై అన్న‌య్య సినిమాల్లో న‌టించి ఆ త‌ర్వాత ఇప్పుడు 'వాల్తేరు వీర‌య్య‌'లో న‌టించాను... అని త‌న జ‌ర్నీ మొత్తాన్ని ర‌వితేజ ఈ వేదిక‌పై గుర్తు చేసుకున్నారు. ''మీతో గ‌డిపిన ప్ర‌తిక్ష‌ణం అన్న‌య్యా.. అది మ‌ర్చిపోలేనిది. మ‌ధ్య‌లో మిమ్మ‌ల్ని తొమ్మిదేళ్లు (రాజ‌కీయాల వ‌ల్ల‌) మిస్స‌య్యాం.. బాబి అన్న‌ట్టు అన్న‌య్య ఎంతో ఓపిక ఓర్పు క‌లిగిన వారు.. ఆయ‌న‌లో కోపం చూడ‌నే లేదు. భాధ‌ప‌డ‌తారే కానీ ఎవ‌రినీ ఏదీ అన‌డం చూడ‌లేదు. ఒక్క‌రి గురించి నెగెటివ్ గా మాట్లాడ‌డం నేను ఏనాడూ చూడ‌లేదు. ఇది కేవ‌లం అన్న‌య్య‌కే సాధ్యం! అంటూ మెగాస్టార్ డిగ్నిటీ గురించి ర‌వితేజ ప్ర‌శంసించారు.

బ‌లుపు టైమ్ లో ప‌రిచ‌య‌మ‌య్యాడు.. క‌థ చెబుతాన‌న్నాడు.. చెప్పి ఒప్పించాడు. ప‌వ‌ర్ ప‌ట్టేశాడు... అంటూ బాబిపైనా ర‌వితేజ ప్రేమాభిమానాలు కురిపించాడు. వాల్తేరు వీర‌య్య‌ సినిమాతో నెక్ట్స్ లెవ‌ల్ కి వెళతాడని పొగిడేశాడు. అన్న‌య్య‌తో క‌లిసి ఇంకా చాలా సినిమాలు చేస్తామ‌ని కూడా అన్నారు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. సంక్రాంతికి ముందే పండ‌గ మొద‌లైంది. పూన‌కాలే.. స‌క్సెస్ మీట్ లో క‌లుద్దాం.. అని ర‌వితేజ స్పీచ్ ని ముగించారు.

ఇక వేదిక వ‌ద్ద అభిమానుల పూన‌కాలు చూసి మెగాస్టార్ చిరంజీవి త‌న‌లోని ఎమోష‌న్ ని దాచుకోలేక‌పోయారు. దానికి తోడు ర‌వితేజ వేదిక‌పై అంత‌మంది అభిమానుల స‌మ‌క్షంలో అన్న‌య్య గురించి పొగిడేస్తూ ప్రేమాభిమానాలు కురిపించిన తీరుకు చిరు ఆల్మోస్ట్ ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు తుడుచుకున్నారు. క‌ర్ఛీఫ్ తో మ‌ధ్య మ‌ధ్య‌లో చిరు త‌న ఎర్ర‌బారిన క‌ళ్ల‌ను తుడుచుకోవ‌డం కెమెరాల్లో విజువ‌ల్స్ లో హైలైట్ గా క‌నిపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.