Begin typing your search above and press return to search.
సంక్రాంతిని టచ్ చేయట్లేదు
By: Tupaki Desk | 22 Dec 2017 6:21 PM ISTచాలాకాలం గ్యాప్ తరవాత రాజాది గ్రేట్ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించాడు మాస్ మహారాజా రవితేజ. అతడి మార్కు కామెడీకి తోడు మామూలు స్టోరీని ఇంట్రస్టింగ్ నెరేట్ చేసే అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ తోడవడంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం రవితేజ తన నెక్ట్స్ సినిమా టచ్ చేసి చూడు కు ఫినిషింగ్ టచెస్ ఇచ్చే పనిలో పడ్డాడు.
ముందుగా ఈ సినిమాను సంక్రాంతి పండగకు థియేటర్లకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు. ఇదే టైంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి థియేటర్లకు రానుంది. దీంతోపాటు హీరో బాలకృష్ణ తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జై సింహా కూడా పండగ రోజుల్లోనే రిలీజవుతోంది. దీంతో టచ్ చేసి చూడు రిలీజ్ పోస్ట్ పోన్ చేయడానికి డిసైడయ్యారు. హీరో రవితేజ కూడా ఇదే బెస్ట్ అని భావస్తున్నాడట. పండగకు పది రోజుల తరవాత జనవరి 25నాటికి ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. పండగ తరవాత పెద్దగా సినిమాలేవీ లేకపోవడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.
టచ్ చేసి చూడు మూవీకి నల్లమలుపు బుజ్జి.. వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాశీఖన్నా.. సీరత్ కపూర్ రవితేజ సరసన ఆడిపాడనున్నారు. కొత్త డైరెక్టర్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పవర్ సినిమా తరవాత మళ్లీ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ మెరవనున్నాడు.
