Begin typing your search above and press return to search.

'ఎఫ్‌3' ముందు పడేనా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:34 AM GMT
ఎఫ్‌3 ముందు పడేనా?
X
గత ఏడాది సంక్రాంతికి 'ఎఫ్‌ 2' చిత్రంతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు దర్శకుడు అనీల్‌ రావిపూడి. వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లతో తెరకెక్కించిన ఆ మల్టీస్టారర్‌ ప్రేక్షకులను మస్త్‌ ఎంటర్‌ టైన్‌ చేసింది. ఆ సినిమా సక్సెస్‌ తో మహేష్‌ బాబును డైరెక్ట్‌ చేసే అవకాశంను అనీల్‌ రావిపూడి దక్కించుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంను మహేష్‌ బాబుతో తెరకెక్కించి మొన్న సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సరిలేరు నీకెవ్వరు కూడా పర్వాలేదు అనిపించుకోవడంతో దర్శకుడు అనీల్‌ రావిపూడి తదుపరి చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అనీల్‌ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్‌ 3 చిత్రం కు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎఫ్‌ 2 కు సీక్వెల్‌ గా రూపొందబోతున్న ఎఫ్‌ 3 చిత్రంలో వెంకటేష్‌.. వరుణ్‌ లతో పాటు రవితేజ కూడా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనీల్‌ రావిపూడి మరియు రవితేజల కాంబో లో రాజా ది గ్రేట్‌ చిత్రం వచ్చింది. ఆ సినిమా రవితేజ కు మంచి సక్సెస్‌ ను ఇచ్చింది. ఆ కారణం గానే ఎఫ్‌ 3 కథ వినకుండానే నటించేందుకు రవితేజ ఓకే చెప్పాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో ఎఫ్‌ 3 కి నిర్మాతగా వ్యవహరించబోతున్న దిల్‌ రాజు మాత్రం రవితేజ ను ఈ చిత్రంలోకి తీసుకోవద్దనే ఉద్దేశ్యం తో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ మార్కెట్‌ డౌన్‌ లో ఉందని.. ఎఫ్‌ 3 చిత్రాన్ని కాస్త ఎక్కువ బడ్జెట్‌ తో తీస్తున్నాం కనుక రవితేజ స్థానంలో మరెవ్వరైనా పెద్ద హీరోను లేదా క్రేజీ హీరోను నటింపజేస్తే బాగుంటుందని దిల్‌ రాజు కమర్షియల్‌ గా ఆలోచిస్తున్నాడట. కాని అనీల్‌ రావిపూడి మాత్రం రవితేజనే కన్ఫర్మ్‌ చేయాలని పట్టుదలగా ఉన్నాడట. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరు రాజీకి వస్తారు..? ఒకవేళ రాజీకి రాకుంటే ఈ ప్రాజెక్ట్‌ ముందల పడేనా? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.