Begin typing your search above and press return to search.

మాస్ మ‌హారాజా స‌రికొత్త అవ‌తారం షాకిస్తోందిగా

By:  Tupaki Desk   |   14 Sept 2020 9:15 AM IST
మాస్ మ‌హారాజా స‌రికొత్త అవ‌తారం షాకిస్తోందిగా
X
ఇటీవ‌ల టాలీవుడ్ హీరోల మేకోవ‌ర్ యూత్ కి స‌రికొత్త గోల్స్ ని నిర్ధేశిస్తున్నాయి. జిమ్ముల్లో కండ‌లు పెంచ‌డం.. అవ‌సరానికి త‌గ్గ‌ట్టు స్లిమ్ముగా మారిపోవ‌డం కోసం హీరోలు శ్ర‌మిస్తున్న తీరు స్ఫూర్తి నింపుతోంది. ఇదిగో 50 ఏజ్ క్రాస్ చేసినా మాస్ మ‌హారాజా ర‌వితేజ లేటెస్ట్ లుక్ చూస్తుంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. ఇంత‌కుముందు ఆయ‌న లుక్ పై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఎవ‌రూ ఊహించ‌నంత ఛేంజ్ చూపిస్తున్నార‌ని అనుకోవాలి.

ఇక మార్చి నుంచి కోవిడ్ -19 లాక్ ‌డౌన్ కారణంగా హీరో రవితేజ పూర్తిగా స్వీయ‌నిర్భంధంలోనే ఉండిపోయారు. ఈ గ్యాప్ లోనే ఈ మార్పు అంతా అని అర్థ‌మ‌వుతోంది. తాజాగా ర‌వితేజ‌ ఇన్ ‌స్టా గ్రామ్ ‌లో కొన్ని ఫోటోల్ని షేర్ చేశారు. బీచ్ లో ఎవ‌రో టీనేజర్ అలా స్లిమ్ముగా క‌నిపిస్తున్నారే! అని షాక్ తింటున్నారంతా. సన్నజాజి తీగ‌లా స‌రికొత్త‌ అవతార్ ‌లో స్టైలిష్ ‌గా కనిపించాడు. `సెట్లు లేవు` అంటూ రవి తేజ పోస్ట్ చేసాడు.

అన్న‌ట్టు క్రాక్ మెజారిటీ షూటింగ్ పూర్త‌యింది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ త్వరలో తిరిగి ప్రారంభమవుతుందని ర‌వితేజ తెలిపాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రవితేజ పోలీస్ పాత్ర స‌ర్ ప్రైజ్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. చాలా సంవత్సరాల క్రితం విజయవాడలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. శ్రుతి హాసన్ ఇందులో క‌థానాయ‌యిక‌. తమన్ సంగీత‌ స్వరకర్త. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.