Begin typing your search above and press return to search.

మాస్ రాజా మొదలెట్టేశాడంతే

By:  Tupaki Desk   |   5 Jan 2018 7:23 AM GMT
మాస్ రాజా మొదలెట్టేశాడంతే
X
రాజా ది గ్రేట్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా రవితేజ అస్సలు ఆగడం లేదు. కొంచెం స్లోగా కథలను ఒకే చేస్తాను అని చెప్పి చాలా స్పీడ్ గా షూటింగ్స్ ను స్టార్ట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న కథలను కూడా డేర్ గా పట్టాలెక్కించేస్తున్నాడు. గత కొంత కాలంగా రవితేజ పలు దర్శకులతో సినిమాను ఒకే చేశాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథను సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేశాడని వార్తలు వచ్చాయి.

అయితే ఫైనల్ గా ఆ ప్రెజెక్ట్ ఈ రోజు పట్టాలెక్కింది. అందుకు సంబందించిన విషయాన్నీ రవితేజ ఒక సెల్ఫీ తో చెప్పేశాడు. దర్శకుడితో అలాగే సినిమాలో నటించే ఇతర నటులతో సెల్ఫీ దిగి రవితేజ సినిమా స్టార్ట్ అయ్యిందని చెప్పేశాడు. ఇక సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుందట. అక్కినేని హీరోలతో సోగ్గాడే చిన్ని నాయన - రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలతో హిట్టు కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇక చుట్టాలబ్బాయి సినిమాను నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రవితేజ ఈ ప్రాజెక్టుతో పాటు ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక త్వరలో శ్రీను వైట్ల ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. చూస్తుంటే మాస్ రాజా ఈ ఏడాది మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.