Begin typing your search above and press return to search.

మాస్ రాజా కొత్త టైటిల్ బాగుంది.. కానీ

By:  Tupaki Desk   |   15 Nov 2017 8:41 AM GMT
మాస్ రాజా కొత్త టైటిల్ బాగుంది.. కానీ
X
రాజా ది గ్రేట్ అంటూ.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు రవితేజ. బోలెడంత గ్యాప్ తర్వాత వచ్చినా.. మాస్ లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న మాస్ మహరాజ్.. ఇప్పుడు టచ్ చేసి చూడు అంటూ మరో మూవీని రిలీజ్ కి రెడీ చేసేస్తున్నాడు. సంక్రాంతి పండక్కి ఈ సినిమా విడుదల కానుండగా.. రవితేజ తరువాతి చిత్రం కూడా ఇప్పటికే ఖాయం అయింది.

ప్రస్తుతం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న శ్రీను వైట్లతో.. ఓ మూవీ చేయనున్నాడు రవితేజ. నీ కోసం మూవీతో తన తొలి చిత్రాన్ని రవితేజతో తీసిన వైట్ల.. ఆ తర్వాత వెంకీ.. దుబాయ్ శీను వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానుండగా.. ఇప్పుడీ చిత్రానికి టైటిల్ ను ఖాయం చేశారట. అమర్ అక్బర్ ఆంథోనీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే.. టైటిల్ వినగానే ఆకట్టుకుంటోంది కానీ.. పేరు వినగానే చాలామందిలో పలు సందేహాలు తలెత్తుతున్నాయి.

సహజంగా మాస్ మహరాజ్ సినిమాల పేర్లన్నీ.. హీరోకే లింక్ అయి ఉంటాయి. కానీ వైట్ల కొత్త సినిమాకు అమర్ అక్బర్ ఆంథోనీ అనే టైటిల్ అంటే.. హీరో మూడు పాత్రల్లో కనిపిస్తాడా.. లేక ఒకటే పాత్రను మూడు డిఫరెంట్ షేడ్స్ లో తెరకెక్కించనున్నాడా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. రవితేజను డ్యుయల్ రోల్ లో చూసిన ఎక్స్ పీరియన్స్ జనాలకు ఉంది. ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ రోల్ చేస్తున్నాడా అన్నదే లేటెస్ట్ డౌట్.