Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: రౌడీగా మారిన S/o మాస్ రాజా

By:  Tupaki Desk   |   23 Nov 2018 6:15 AM GMT
ఫోటో స్టొరీ: రౌడీగా మారిన S/o మాస్ రాజా
X
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జస్ట్ యూత్ లోనే కాదు కిడ్స్ లో కూడా ఫాలోయింగ్ ఉంది. అనుమానం ఏమీ అవసరం లేదు. రీసెంట్ గా విజయ్ క్లోతింగ్ బ్రాండ్ రౌడీవేర్ దుస్తులు ధరించి చాలామంది పిల్లలతో రౌడీ హీరో పోజిచ్చాడు. పిల్లలందరూ కూడా రౌడీ చొక్కాలు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు.

ఇక ఈ ఫోటోలో స్పెషాలిటి ఏంటంటే మాస్ మహారాజా రవితేజ పిల్లలు కూడా ఉండడం. రవితేజ తనయుడు మహాధన్ ఫోటోలు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. రవితేజ సినిమా 'రాజా ది గ్రేట్' సినిమాలో మహాధన్ చిన్నప్పటి రవితేజ పాత్రలో కూడా నటించాడు. ఇప్పుడు రౌడీ హీరో కిడ్స్ గ్యాంగులో జాయిన్ కావడం విశేషమే. రౌడీ బట్టలు వేసుకొని విజయ్ దేవరకొండ బ్రాండును ప్రమోట్ చేస్తున్నారు. ఈఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటుగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కూడా మెప్పిస్తున్నాయి.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. ఇప్పటికే పెట్టుబడి వెనక్కు రాబట్టిన చిత్రం లాభాల బాటలో నడుస్తోంది. రజనీకాంత్ తాజా చిత్రం '2.0' వచ్చే వరకూ 'టాక్సీవాలా' కు పెద్దగా పోటీ లేదు.