Begin typing your search above and press return to search.

తన తొలి హీరోయిన్ తో రవితేజ కొడుకు

By:  Tupaki Desk   |   7 Sep 2017 7:02 AM GMT
తన తొలి హీరోయిన్ తో రవితేజ కొడుకు
X
అదేంటీ.. రవితేజ కొడుకు ఇంకా టీనేజ్ పిల్లాడే కదా.. అప్పుడే హీరోయిన్ వరకు మ్యాటర్ ఎలా వచ్చేసింది అనుకుంటున్నారా? ఇక్కడే ఓ టాపిక్ గురించి డీటైల్డ్ గా చెప్పుకోవాలి. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్. ఇందులో మాస్ మహరాజ్ అంధుడి పాత్రలో కనిపించనుండగా.. ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్ర కూడా ఉంటుంది.

'రాజా ది గ్రేట్' సినిమాలో చిన్ననాటి రవితేజ పాత్రలో కొడుకు మహాధన్ నటిస్తున్నాడు. పలువురు చైల్డ్ ఆర్టిస్టులను పరిశీలించి.. చివరకు మహాధన్ తోనే ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఆ సందర్భంగా తన తల్లి పాత్రదారి రాధిక.. గాళ్ ఫ్రెండ్ పాత్రధారి మెహ్రీన్ తో ఇలా ఫోజులిచ్చాడు మహాధన్. ఈ సినిమాలో రవితేజ గాళ్ ఫ్రెండ్ గా నటిస్తున్న భామ మెహ్రీన్ కౌర్ పీర్జాడా. అదే పాత్రకు చిన్నప్పటి వెర్షన్ లోనే మహాధన్ కనిపించనున్నాడు. అంటే రాజా ది గ్రేట్ మూవీలో మహాధన్ కు కూడా మెహ్రీన్ గాళ్ ఫ్రెండే. అయితే.. రవితేజగా ఎదిగిన తర్వాత మాత్రమే అన్నమాట.

అంటే.. టెక్నికల్ గా చూస్తే.. మహాధన్ కు తొలి హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పీర్జాడా అనే చెప్పాలి. ఒప్పుకునేందుకు కాసింత కష్టమైన ఇదే వాస్తవం. ఒకవైపు అమ్మ పాత్రలో నటిస్తున్న రాధిక.. గాళ్ ఫ్రెండ్ గా నటిస్తున్న మెహ్రీన్ తో ఇలా ఫోటోలకు పోజులు ఇచ్చాడు మహాధన్. ఇక దీపావళి సందర్భంగా.. అక్టోబర్ లో రాజా ది గ్రేట్ రిలీజ్ అవుతోంది. అంధుడి పాత్రలో మాస్ మహరాజ్ ఎలా అలరించాడనే పాయింట్ తో పాటు.. రవితేజ కుమారుడు మహాధన్ ను ఆన్ స్క్రీన్ పై చూసేందుకు జనాలు ఉత్సాహం చూపిస్తున్నారు.