Begin typing your search above and press return to search.

ఫస్ట లుక్: 'రాజా ది గ్రేట్'లో రవితేజ జూనియర్

By:  Tupaki Desk   |   6 Sep 2017 6:49 AM GMT
ఫస్ట లుక్: రాజా ది గ్రేట్లో రవితేజ జూనియర్
X
ఆల్రెడీ మనం చెప్పుకున్న విషయం ఏంటంటే.. మాస్ రాజా రవితేజ కొడుకు మహాధన్.. త్వరలోనే సినిమాల్లోకి రాబోతున్నాడని. అయితే ఇంకా చిన్నపిల్లాడే కాబట్టి.. అప్పుడే హీరోగా కనిపించడని అందరికీ తెలుసు. అయితే మహాధన్ ఏకంగా తన తండ్రి సినిమాలో తన తండ్రి చిన్నప్పటి పాత్రనే పోషిస్తున్నాడనేది టాక్. ఇప్పుడు అదే నిజం అంటూ కన్ఫామ్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

''రాజా ది గ్రేట్'' అంటూ ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరో రవితేజ ఒక అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ పాత్ర చిన్నప్పటి నుండి కూడా అంధత్వంతోనే ఉంటుంది. అందుకే చిన్నప్పటి పాత్రను పోషించడానికి ఎవరైనా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలాంటూ చాలా అన్వేషించి.. చివరకు రవితేజ కొడుకు అయితే బెటర్ అంటూ అనిల్ రావిపూడి సూచించి ఒప్పించాడట. అదిగో ఇప్పుడు మహాధన్ షూటింగ్ స్పాటుకు కూడా వచ్చేశాడు. అతడిపై సీన్లను తీస్తున్న తాలూకు ఫోటోలను డైరక్టర్ ఈరోజే షేర్ చేశాడులే.

మొత్తానికి మరో స్టార్ హీరో తన కొడుకును ఇలా సినిమా రంగం వైపే నడిపిస్తున్నాడనమాట. ఇది తొలి అడుగు కాబట్టి.. రవితేజ కొడుకు ఎలా చేశాడో చూడాలంటే మనం సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.