Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : గత జ్ఞాపకాల్లోకి వెళ్లిన మాస్ రాజా

By:  Tupaki Desk   |   9 Nov 2020 4:40 PM IST
క్లిక్‌ క్లిక్‌ : గత జ్ఞాపకాల్లోకి వెళ్లిన మాస్ రాజా
X
ఈమద్య కాలంలో స్టార్స్‌ అంతా కూడా సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. నెట్టింట వారి సినిమా ఫొటోలు మరియు ఫ్యామిలీ ఫొటోలు పాత ఫొటోలు ఇలా ఏదో ఒకటి రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూ వస్తున్నారు. సోషల్‌ మీడియా లో ముఖ్యంగా ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఫాలోవర్స్‌ సంఖ్య పెంచుకునేందుకు స్టార్స్‌ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుత ఫొటోలు లేకుంటే థ్రూ బ్యాక్‌ అంటూ పాత ఫొటోను షేర్‌ చేస్తూ గత జ్ఞాపకాల్లోకి వెళ్తున్నారు. స్టార్స్‌ పాత ఫొటోలను షేర్‌ చేసి నెట్టింట వైరల్‌ అవుతున్నారు. ఈసారి రవితేజ వంతు వచ్చింది.

ఇన్‌ స్టా గ్రామ్‌ లో రవితేజ షేర్‌ చేసిన ఈ ఫొటోలు కొన్నాళ్ల క్రితం లండన్‌ లో తీసుకున్నవి. కుటుంబ సభ్యులతో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో తీసుకున్న ఈ ఫొటోలను ఇప్పుడు షేర్‌ చేశాడు. లండన్‌ వీదుల్లో చక్కర్లు కొట్టిన రవితేజ స్టైలిష్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు అంటున్నారు. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన క్రాస్‌ సినిమాను విడుదలకు సిద్దం చేసి 'ఖిలాడి' షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో రవితేజ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక క్రాక్‌ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను చూస్తేనే అర్థం అవుతుంది.