Begin typing your search above and press return to search.

మరోసారి పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజ్

By:  Tupaki Desk   |   16 April 2020 9:00 PM IST
మరోసారి పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజ్
X
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన సినీ జీవితంలో ఎన్నో హిట్స్, ప్లాపులు రుచిచూసాడు. రవితేజ ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మన్స్ చూడటానికే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. లేటెస్ట్ గా రవితేజ చేసిన డిస్కో రాజా సైన్స్ ఫిక్షన్ సినిమా ఆయన కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రవితేజ చేస్తున్న క్రాక్ ఒక కాప్ డ్రామా సినిమా. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. మొదటి నుండి ఈ చిత్రం ఒక తమిళ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే టీజర్ చూసాక అది నిజమేనని తేలింది. తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతికి ఇది రీమేక్ అని తేలింది.

ఇక దీని తర్వాత మాస్ రాజా మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. వీర సినిమా తీసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడట. రమేష్ వర్మ కెరీర్ లో సాధించిన ఏకైక హిట్ రాక్షసుడు. ఆ సినిమా తమిళ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్. ఈ నేపథ్యంలో రవితేజతో రమేష్ వర్మ చేస్తోన్న చిత్రం కూడా రీమేక్ అని తేలింది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'సతురంగ వెట్టై 2' చిత్రంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా సీక్వెల్ తెరకెక్కింది.

ఆ సినిమా ప్రివ్యూ చూసిన రమేష్ వర్మ ఇప్పుడు దాన్ని రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్స్ లో కనిపించనున్నాడట. ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా, బిజినెస్ మ్యాన్ గా మరో పాత్రలో కనిపిస్తాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. నిధి అగర్వాల్, మాళవిక శర్మలను హీరోయిన్స్ గా సెలెక్ట్ చేయనున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తారట.