Begin typing your search above and press return to search.

రవితేజ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడిందే..!

By:  Tupaki Desk   |   26 May 2022 6:33 AM GMT
రవితేజ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడిందే..!
X
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్ 17న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా విడుదల వాయిదా వేస్తున్నామని.. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. నిజానికి రవితేజ చిత్రాన్ని ముందుగా మార్చి 25న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మార్చి 25న లేదా ఏప్రిల్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

పెద్ద సినిమాల మధ్య క్లాష్ ని నివారించేందుకు రామారావు ఆన్ డ్యూటీ ని చివరగా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా మరోసారి సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

"బిగ్ స్క్రీన్‌ పైకి బెస్ట్ అండ్ భారీ అవుట్‌ పుట్‌ ని తీసుకురావడానికి, 'రామారావు ఆన్ డ్యూటీ' పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి అదనపు కేర్ తీసుకోవడం జరుగుతోంది. అందుకే విడుదల వాయిదా పడింది. జూన్ 17న ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం" అని చిత్ర నిర్మాతలు ప్రకటనలో పేర్కొన్నారు.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న 'రామరావు ఆన్ డ్యూటీ' చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. నాజర్ - సీనియర్ నరేష్ - పవిత్ర లోకేష్ - 'సర్పట్ట' జాన్ విజయ్ - చైతన్య కృష్ణ - తనికెళ్ల భరణి - రాహుల్ రామకృష్ణ - ఈరోజుల్లో శ్రీ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.