Begin typing your search above and press return to search.

రవితేజ ‘క్రాక్‌’ వర్కౌట్‌ అయితే అద్బుతమే

By:  Tupaki Desk   |   24 April 2020 12:20 PM IST
రవితేజ ‘క్రాక్‌’ వర్కౌట్‌ అయితే అద్బుతమే
X
తమిళ మూవీ సేతుపతి కథాంశంతో ప్రస్తుతం రవితేజతో గోపీచంద్‌ మలినేని ‘క్రాక్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు లో వర్కౌట్‌ కాని సేతుపతికి కాస్త స్టైల్‌ మార్చి రవితేజ బాడీ లాంగ్వేజ్‌ కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ ను రూపొందించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు రవితేజ.. గోపీచంద్‌ మలినేనిల కాంబినేషన్‌ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీరి కాంబోలో క్రాక్‌ చిత్రం మరో విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్‌ గా నిలుస్తుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ.. శృతిహాసన్‌ ల జోడీ కూడా ఈ సినిమాకు పాజిటివ్‌ సెంటిమెంట్‌ అంటున్నారు. వీరిద్దరి జోడీ తప్పకుండా వర్కౌట్‌ అవుతుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. యూనిట్‌ సభ్యులు పాజిటివ్‌ సెంటిమెంట్స్‌ చెబుతుంటే కొందరు సినీ వర్గాల వారు మాత్రం కొన్ని నెగటివ్‌ సెంటిమెంట్స్‌ ను లేవనెత్తుతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఠాగూర్‌ మధు ఇప్పటి వరకు సాలిడ్‌ సక్సెస్‌ ను దక్కించుకోలేక పోయాడు. చాలా ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్న ఈయన ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రం అందుకోలేక పోయారు.

నిర్మాతతో పాటు రవితేజ కూడా ఈ సినిమాకు బ్యాడ్‌ సెంటిమెంట్‌ అంటున్నారు. వరుసగా రవితేజ ఫ్లాప్స్‌ చవిచూస్తూ వస్తున్నాడు. రాజా ది గ్రేట్‌ తర్వాత రవితేజ సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన సినిమాలకు ఎంత హైప్‌ క్రియేట్‌ చేస్తే అంతగా డిజాస్టర్‌ అవుతున్నాయి. క్రాక్‌ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈ సమ్మర్‌ లో క్రాక్‌ ను తీసుకు రావాలనుకుంటే లాక్‌ డౌన్‌ కారణంగా అది సాధ్యం కాకపోవచ్చు.