Begin typing your search above and press return to search.
వాల్తేరు వీరన్నతో మాస్ రావణాసుర
By: Tupaki Desk | 15 Dec 2021 9:00 PM ISTమెగా స్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటీగా వారిని మించి ఒకే సారి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య విడుదలకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరిలో ఆచార్య సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కాకుండా మలయాళ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్ ను మోహన రాజా దర్శకత్వంలో చేస్తున్నాడు.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమా ను భోలా శంకర్ టైటిల్ తో మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మరో వైపు జై లవకుశ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వాల్తేరు వీరన్న సినిమాలో చిరంజీవి లుక్ కు సంబంధించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిరంజీవి మాస్ లుక్ ఆయన అభిమానులను 1980 ల్లోకి తీసుకు వెళ్తుందని అంటున్నారు.
చిరంజీవి చేస్తున్న ప్రతి ఒక్క సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ప్రతి సినిమా గురించి ఎన్నో పుకార్లు ఉన్నాయి. కాని అన్ని పుకార్లలోకి వాల్తేరు వీరన్న సినిమాలో మరో హీరో నటించబోతున్నాడు అనే పుకారు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వార్త నిజం అవ్వాలని అంతా కోరుకుంటున్నారు.
ఆ హీరో మరెవ్వరో కాదు రవితేజ. గతంలో చిరంజీవి సినిమాల్లో రవితేజ నటించాడు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. రవితేజ మాస్ హీరోగా స్టార్ డమ్ దక్కించుకున్నాడు. ఆయన ఇంతకు ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిరంజీవి సినిమాలో నటించాడు కనుక పెద్దగా ప్రాముఖ్యత లేదు. కాని ఇప్పుడు ఒక స్టార్ హీరోగా రవితేజ వాల్తేరు వీరన్న సినిమాలో నటిస్తే ఖచ్చితంగా హైప్ భారీగా ఉంటుంది.
రవితేజ కూడా చిరంజీవి మాదిరిగా వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. కొన్ని సినిమాలు విడుదలకు సిద్దం చేశాడు. ఖిలాడి సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ దశలో ఉంది. ధమాకా మరియు టైగర్ నాగేశ్వరరావులు త్వరలో చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నాయి.
ఇదే సమయంలో రావణాసుర అనే విభిన్నమైన సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు. రావణాసుర సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నాలుగు అయిదు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ అభిమానులు గుక్క తిప్పుకోకుండా చేసేలా విడుదల చేసేందుకు గాను రవితేజ ప్లాన్ చేస్తున్నాడు.
ఇలాంటి సమయంలో వాల్తేరు వీరన్న సినిమాలో కూడా రవితేజ నటించడం వల్ల ఖచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. చిరు.. రవితేజల కాంబో కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బాబీ ఈ వార్తను ఎప్పుడు దృవీకరిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.