Begin typing your search above and press return to search.

ఆస్ప‌త్రిలో మాస్‌ రాజాకేం ప‌ని?

By:  Tupaki Desk   |   30 July 2018 6:04 AM GMT
ఆస్ప‌త్రిలో మాస్‌ రాజాకేం ప‌ని?
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌న‌ని తాను రీఇన్వెంట్ చేసుకుంటున్న సంద‌ర్భమిది. గ‌డిచిన కొద్దిరోజులుగా అత‌డిలో ఎంతో మార్పు క‌నిపిస్తోంది. కొన్ని వ‌రుస‌ ప‌రాజ‌యాలు - ఉన్న‌ట్టుండి ఒక బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ అన్న తీరుగా అత‌డి కెరీర్ అలా అలా సాగిపోతోంది. క‌థ‌ల్లో కొత్త‌ద‌నం, దాంతో పాటే మునుప‌టి ఎన‌ర్జీ చూపిస్తే విజ‌యం సాధ్య‌మేన‌ని `రాజా ది గ్రేట్` నిరూపించింది. అదంతా అటుంచితే త‌న గ్రేట్ ఫ్రెండ్ శ్రీ‌నువైట్ల కెరీర్‌ ని గాడిలో పెట్టేందుకు అత‌డు ఎంతో ఔన్న‌త్యంతో ఓ గొప్ప అవ‌కాశం ఇచ్చాడు. అలా తెరకెక్కుతున్న‌దే `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`. ఈ సినిమాతో ఫ్రెండ్స్ కంబ్యాక్ అవుతారా లేదా.. అన్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్‌!!

ప్ర‌స్తుతం `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. హైద‌రాబాద్ చిత్ర‌పురి కాల‌నీ ప‌రిస‌రాల్లోని స‌న్‌ షైన్ ఆస్ప‌త్రిలో ర‌వితేజ‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. త‌దుప‌రి అమెరికాలో భారీ షెడ్యూల్‌కి శ్రీ‌నువైట్ల ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఇందులో ర‌వితేజ‌-ఇలియానాపై ఘాటైన స‌న్నివేశాలు మ‌తి చెడ‌గొడ‌తాయిట‌. ఇక‌పోతే నాలుగో సారి ర‌వితేజ‌- ఇలియానా కాంబో రిపీటవుతోంది. కిక్‌ - దేవుడు చేసిన మ‌నుషులు - ఖ‌త‌ర్నాక్ వంటి చిత్రాల్లో న‌టించిన ఈ జోడీ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`తో నాలుగోసారి జ‌త‌ క‌డుతున్నారు. కిక్ త‌ర్వాత ఫ్లాప్ పెయిర్‌ గా ముద్ర ప‌డిన ఈ జంట మ‌రి ఈసారైనా హిట్టు కొడ‌తారా లేదా? ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న శ్రీ‌నూకి ఓ హిట్టిస్తారా.. లేదా? అన్న‌ది కాస్త వేచి చూడాలి. స‌క్సెస్‌ల మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ సినిమా నిర్మిస్తోంది కాబ‌ట్టి ఆ బ్యాక్‌ డ్రాప్ ఈ బృందానికి క‌లిసొస్తుంద‌నే ఆశిస్తున్నారంతా. నీకోసం - వెంకీ - దుబాయ్ శ్రీ‌ను వంటి హ్యాట్రిక్ విజ‌యాల్ని ర‌వితేజ‌కు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌కు మాస్ రాజా కంబ్యాక్ హిట్ ఇస్తాడా లేదా? అన్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది.