Begin typing your search above and press return to search.

రవితేజ ఉన్నదున్నట్లు చూపించేస్తాడట

By:  Tupaki Desk   |   19 Dec 2015 1:00 PM IST
రవితేజ ఉన్నదున్నట్లు చూపించేస్తాడట
X
50 ఏళ్లకు దగ్గరగా వచ్చేశాడు మాస్ రాజా రవితేజ. రెండు మూడేళ్ల కిందటి వరకు లుక్ విషయంలో ఎలాగోలా మేనేజ్ చేస్తూ వచ్చాడు కానీ.. ఈ మధ్య వయసు ప్రభావం స్పష్టంగా తెలిసిపోతోంది. దీనికి తోడు డైటింగ్ అదీ చేసి సన్నబడ్డంతో లుక్ బాగా దెబ్బ తింది. అర్జెంటుగా కొంచెం కండపట్టి పూర్వపు లుక్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు రవితేజ.

తెలుగు సినిమాల్లో హీరో ఎప్పుడూ నవ యువకుడిగానే కనిపించాలి కాబట్టి స్టార్ హీరోలు లుక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు. మనవాళ్లు వయసుకు తగ్గ పాత్రలు పోషించడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఐతే రవితేజకు ఆ అవకాశం దక్కబోతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో రవితేజ 50 ఏళ్ల వాడిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇందులో మాస్ రాజా ద్విపాత్రాభినయం చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఓ పాత్ర యువకుడిదైతే.. ఇంకోటి 50 ఏళ్ల వయసు వాడిది. కిక్-2 ఆరంభంలో కనిపించినట్లు తన ఒరిజినల్ లుక్ తో దర్శనమివ్వబోతున్నాడు రవితేజ. మాస్ రాజా కెరీర్ లో ఇదో వైవిధ్యమైన సినిమా అవుతుందని.. దోచెయ్ సినిమాతో నిరాశ పరిచిన సుధీర్ వర్మ చాలా కసితో ఈ సినిమా స్క్రిప్టును తీర్చిదిద్దాడని అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.