Begin typing your search above and press return to search.

మాస్ మహారాజా సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందా...?

By:  Tupaki Desk   |   10 July 2020 12:45 PM IST
మాస్ మహారాజా సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందా...?
X
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత నాలుగు నెలలుగా సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. దీంతో సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇది ఎంత కాలం కొనసాగుతుందో.. థియేటర్స్ ఓపెన్ చేసినా మునుపటిలా ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని ఆలోచించిన నిర్మాతలు తమ సినిమాను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు సినిమాకి పెట్టుబడి మొత్తం స్టక్ అయిపోవడంతో నిర్మాతలు నష్టాల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది. దీంతో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయడమే శరణ్యమని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న డజను సినిమాలకు పైగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కాకపోతే హిందీలో స్టార్ హీరోల మూవీస్ ఓటీటీ బాట పడుతున్నా ఇప్పటి వరకు తెలుగులో పెద్ద హీరోల సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవ్వలేదు. కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' సినిమా రిలీజ్ అయినప్పటికీ అది కూడా డబ్బింగ్ సినిమా.. స్ట్రెయిట్ తెలుగు మూవీ కాదు. అయితే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తలు బట్టి ఓ స్టార్ హీరో సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'క్రాక్' ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ 'క్రాక్' మేకర్స్ తో చర్చలు జరుపుతున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' ఒక చిన్న షెడ్యూల్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. దీంతో ఓటీటీలు రవితేజ 'క్రాక్' కోసం ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేస్తున్నాయట. కాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ కుమార్ సినిమా 'లక్ష్మీబాంబ్' మరియు అజయ్ దేవగన్ 'భుజ్' సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నప్పుడు తెలుగులో రవితేజ సినిమా ఇలా డైరెక్ట్ రిలీజ్ చేయడంలో తప్పు లేదనే కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరో ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.